బిజినెస్

ఆకట్టుకున్న ఆటో షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 2: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 16 నెలల గరిష్ఠాన్ని తాకితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ మళ్లీ 8,800 మార్కును అధిగమించింది. ఆగస్టు నెలలో ఆటో రంగ అమ్మకాలు బాగుండటం, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కదలాడటం కలిసొచ్చింది. ఈ క్రమంలోనే గురువారం నష్టాల్లో ముగిసిన సూచీలు తిరిగి లాభాలను అందుకోగలిగాయి. సెనె్సక్స్ 108.63 పాయింట్లు పుంజుకుని 28,532.11 వద్ద ముగియగా, 2015 ఏప్రిల్ 16 తర్వాత మళ్లీ ఈ స్థాయికి చేరడం ఇదే ప్రథమం. నిఫ్టీ కూడా 35 పాయింట్లు అందిపుచ్చుకుని 8,809.65 వద్ద నిలిచింది. 2015 ఏప్రిల్ 13 నుంచి నిఫ్టీ 8,800 మార్కును అధిగమించడం ఇదే తొలిసారి. ఇకపోతే ఈ వారం మొత్తంగా సెనె్సక్స్ 749.86 పాయింట్లు ఎగబాకితే, నిఫ్టీ 237.10 పాయింట్లు ఎగిసింది. ఆటో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్టీ, హెల్త్‌కేర్, పవర్, బ్యాంకింగ్ రంగాల షేర్ల విలువ 1.01 శాతం నుంచి 0.55 శాతం మేర పెరిగింది. అయితే మెటల్, ఐటి, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్ల విలువ 0.29 శాతం నుంచి 0.10 శాతం వరకు నష్టపోయింది. అంతర్జాతీయంగా ఇతర ఆసియా మార్కెట్లలోనూ మెజారిటీ సూచీలు లాభాల్లో ముగియగా, హాంకాంగ్, దక్షిణకొరియా, చైనా సూచీలు 0.45 శాతం వరకు పెరిగాయి. ఐరోపా మార్కెట్లలోనూ బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు లాభాల్లో నడిచాయి.
ఇంట్రాడేలో ఆర్‌ఐఎల్‌ను అధిగమించిన
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్ విలువ
న్యూఢిల్లీ: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్.. శుక్రవారం ట్రేడింగ్‌లో ఒకానొక దశలో మార్కెట్ విలువపరంగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని బహుళ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)ను అధిగమించింది. మధ్యాహ్నం ఒంటిగంట 32 నిమిషాలకు రిలయన్స్ షేర్ విలువ 1,003.10 రూపాయలకు దిగజారగా, దాని మార్కెట్ విలువ 3,25,249 కోట్ల రూపాయలకు పడిపోయింది. ఇదే సమయంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్ విలువ 1,285 రూపాయలు పలకగా, మార్కెట్ విలువ 3,25,754 కోట్ల రూపాయలను తాకింది. దీంతో సెనె్సక్స్ టాప్-10 సంస్థల మార్కెట్ విలువలో ఆర్‌ఐఎల్‌ను వెనక్కినెట్టి దేశీయ ఐటిరంగ దిగ్గజం టిసిఎస్ తర్వాత రెండో స్థానంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నిలిచింది. అయితే మదుపరుల మద్దతును తిరిగి కూడగట్టుకున్న ఆర్‌ఐఎల్.. చివరకు 3,28,477.87 కోట్ల రూపాయల మార్కెట్ విలువను సొంతం చేసుకుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్ విలువ 3,26,549.50 కోట్ల రూపాయల వద్ద స్థిరపడింది. ఆర్‌ఐఎల్ మార్కెట్ విలువకు ఇది 1,928.37 కోట్ల రూపాయలు దూరం.
ఇక ట్రేడింగ్ ఆఖర్లో హెచ్‌డిఎఫ్‌సి షేర్ విలువ 1,284.45 రూపాయలుగా ఉంటే, ఆర్‌ఐఎల్ షేర్ల విలువ 1,012.85 రూపాయల వద్ద ఉంది. సెనె్సక్స్ మార్కెట్ విలువలో టిసిఎస్ 4,95,267.06 కోట్ల రూపాయలతో ముందుండగా, టాప్-5లో రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐటిసి, ఇన్ఫోసిస్ ఉన్నాయి.
5న సెలవు, 6న ఎన్‌ఎస్‌ఇలో బాండ్ల వేలం
నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ మంగళవారం విదేశీ మదుపరులకు 7,046 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ బాండ్లను వేలం వేయనుంది. నిజానికి సోమవారమే వేలం జరగాల్సి ఉన్నప్పటికీ, వినాయక చవితి సందర్భంగా మార్కెట్లకు సెలవు. దీంతో మంగళవారం నిర్వహిస్తున్నారు.
సాధారణ ట్రేడింగ్ అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు గంటలపాటు వేలం నిర్వహిస్తారు. ప్రభుత్వ రుణ బాండ్లలో విదేశీ పెట్టుబడులకున్న పరిమితిలో గురువారం నాటికి 95.11 శాతం పెట్టుబడులను విదేశీ మదుపరులు పెట్టారు. పెట్టుబడుల పరిమితి 1.44 లక్షల కోట్ల రూపాయలవగా, 1,36,954 కోట్ల రూపాయల పెట్టుబడులున్నాయి.
శుక్రవారం
బిఎస్‌ఇ వద్ద నిర్వహించిన
ఓ సదస్సులో బిఎస్‌ఇ సిఇఒ ఆశిష్ చౌహాన్ నుంచి మెమెంటోను అందుకుంటున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ