బిజినెస్

ఉత్పత్తి యథాతథం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: దేశవ్యాప్తంగా శుక్రవారం కార్మిక లోకం పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మె ప్రభావం ఆటోరంగ సంస్థల్లో పాక్షికంగానే కనిపించింది. మారుతి సుజుకితోపాటు టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, హోండా కార్స్ ఇండియా ప్లాంట్లలో కార్మికుల హాజరు 80 శాతం వరకు ఉన్నట్లు ఆయా సంస్థలు వెల్లడించాయి. దీంతో ఉత్పత్తికి చెప్పుకోదగ్గ ఆటంకమేమీ రాలేదన్నాయి. మరోవైపు టాటా స్టీల్ ప్లాంట్లలోనూ ఉత్పత్తికి పెద్దగా ఇబ్బందేమీ కలగలేదు. దాదాపు సాధారణంగానే కార్మికులు హాజరైనట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వరంగ ఉక్కు ఉత్పాదక దిగ్గజం సెయిల్ సైతం 94 శాతం మంది కార్మికులు విధులకు హాజరైనట్లు ప్రకటించింది. కాగా, ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. సుమారు 80 శాతం మంది సమ్మెకు మద్దతుగా విధులను బహిష్కరించినట్లు సంస్థ ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసనగా, కనీస డిమాండ్ల పరిష్కారం దిశగా ట్రేడ్ యూనియన్లు ఒకరోజు సమ్మెకు దిగినది తెలిసిందే.

క్షీణించిన బజాజ్ ఆటో అమ్మకాలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: దేశీయ ఆటోరంగ సంస్థ, ద్విచక్ర, త్రిచక్ర వాహన తయారీదారు బజాజ్ ఆటో అమ్మకాలు గత నెల ఆగస్టులో క్రితంతో పోల్చితే 5 శాతం పడిపోయాయి. ఈసారి 3,25,347 యూనిట్ల అమ్మకాలు జరిగితే, నిరుడు ఆగస్టులో 3,41,965 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 4 శాతం క్షీణించి 2,79,911 యూనిట్లుగా ఉన్నాయి. పోయినసారి 2,90,436 యూనిట్ల విక్రయాలు జరిగాయి. అలాగే వాణిజ్య వాహన విక్రయాలు ఈ ఆగస్టులో 45,436 యూనిట్లుగా ఉంటే, గత ఆగస్టులో 51,529 యూనిట్లుగా ఉన్నాయి. దీంతో 12 శాతం దిగజారినట్లైంది. ఇకపోతే విదేశాలకు ఎగుమతులు ఈ ఆగస్టులో 1,25,033 యూనిట్లు జరిగితే, గత ఆగస్టులో 1,81,658 యూనిట్లుగా ఉన్నాయి. ఫలితంగా 31 శాతం పతనాన్ని చవిచూశామని శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు బజాజ్ ఆటో తెలియజేసింది. శుక్రవారం ట్రేడింగ్‌లో బజాజ్ ఆటో షేర్ విలువ గురువారంతో పోల్చితే 1.52 శాతం పడిపోయి 2,951.05 రూపాయల వద్ద స్థిరపడింది.

రూ. 249కే బిఎస్‌ఎన్‌ఎల్
అపరిమిత వైర్‌లైన్ బ్రాడ్‌బాండ్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్.. త్వరలో ఓ ప్రమోషనల్ అపరిమిత వైర్‌లైన్ బ్రాడ్‌బాండ్ ప్లాన్‌ను పరిచయం చేయనున్నట్లు శుక్రవారం తెలిపింది. రిలయన్స్ జియో 50 రూపాయలకే ఒక జిబి డేటాను అందిస్తామని గురువారం ప్రకటించిన నేపథ్యంలో ఒక జిబి డౌన్‌లోడ్ విలువను రూపాయి కంటే తక్కువ చేస్తూ సరికొత్త పథకాన్ని తెస్తోంది బిఎస్‌ఎన్‌ఎల్. 249 రూపాయలకు నెలలో 300 జిబి డేటా వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. మొత్తానికి టెలికామ్ రంగంలో జియో సృష్టిస్తు న్న సునామీ మధ్య కస్టమర్లను ఆకర్షించడానికి ఇతర టె లికామ్ ఆపరేటర్లతోపాటు బిఎస్‌ఎన్‌ఎల్ శ్రమిస్తోంది.