బిజినెస్

హైదరాబాద్‌లో మరో 6 ‘పాయ్’ స్టోర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల రిటైల్ విక్రయ సంస్థ పాయ్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.. ఇకపై ఏటా కొత్తగా 10 నుంచి 15 స్టోర్లను ప్రారంభించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. శనివారం ఒక్కరోజే హైదరాబాద్‌లో 6 మెగా ఎలక్ట్రానిక్ షోరూమ్‌లను తెరుస్తామని ఇక్కడ ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ పాయ్ తెలిపారు. కస్టమర్లకు బంపర్ ఆఫర్లను కూడా పెట్టినట్లు వివరించారు. ఒక్కో స్టోర్‌పై 3 నుంచి 5 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 15 స్టోర్లున్నాయని, దేశవ్యాప్తంగా తమకు 80కిపైగా స్టోర్లున్నట్లు వివరించారు. కాగా, వచ్చే పండగ సీజన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తామన్నారు. విజయవాడ, విశాఖపట్నం, గాజువాకలో తొలుత స్టోర్లను అందుబాటులోకి తెస్తామని, తర్వాత ప్రతి జిల్లా కేంద్రానికి విస్తరిస్తామని తెలియజేశారు. ఇక తమ సొంత బ్రాండ్ ‘హెన్రీ’ని త్వరలోనే పరిచయం చేస్తామని, ఇందుకు 40 నుంచి 50 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెడుతున్నామన్నారు. మొదట హెన్రీ ఎల్‌ఇడి టెలివిజన్లను ఆవిష్కరించే పనిలో ఉన్నామని తెలిపారు.
ఇప్పటికే తమకు మైక్రోమ్యాక్స్ టెలివిజన్లు, ఎల్‌జి మొబైల్ డిస్ట్రిబ్యూషన్లున్నాయన్న ఆయన 70 లక్షల వినియోగదారులకు తాము చేరువయ్యామన్నారు. 2020 నాటికి 3 కోట్ల వినియోగదారులు లక్ష్యమని, ఈ క్రమంలోనే నూతన స్టోర్లను విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలావుంటే గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో 1,800 కోట్ల రూపాయల టర్నోవర్‌ను సాధించామని రాజ్‌కుమార్ పాయ్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక నిధుల సమీకరణలో భాగంగా స్టాక్ మార్కెట్లలోకి కూడా ప్రవేశించే యోచనలో ఉన్నామన్న ఆయన ఎప్పుడన్నది మాత్రం తెలియజేయలేదు. అయితే వీలైనంత త్వరలో ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూ (ఐపిఒ)ను ప్రకటించవచ్చని చెప్పారు.
మెగా షోరూమ్‌ల ప్రారంభోత్సవ వివరాలను వెల్లడిస్తున్న పాయ్ ప్రతినిధులు