బిజినెస్

చైనాకు తగ్గుతున్న గ్రానైట్ ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, సెప్టెంబర్ 4: చైనాకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ ఎగుమతులు తగ్గిపోతున్నాయి. చైనా వ్యాపారులు అలవెన్స్‌లు ఎక్కువగా తీసుకుంటుండటంతో గ్రానైట్ క్వారీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. గతంలో ఒక క్యూబిక్ మీటరు గెలాక్సీ రాయిని చైనాకు ఎగుమతి చేస్తే గ్రానైట్ అలవెన్స్‌గా మరో 1.8 క్యూబిక్ మీటరు రాయిని ఎగుమతి చేసేవారు. అయతే ప్రస్తుతం చైనాలో ఇంజనీర్డ్ అనే గ్రానైట్ ఉత్పత్తులు పెరగటంతో వ్యాపారులు ఇక్కడి కొనుగోళ్లను కొంతమేర తగ్గించారు. అంతేగాక అలవెన్స్‌లు పెంచారు. గతంలో ఒక క్యూబిక్ మీటరు రాయికి 1.8 అలవెన్స్ ఇచ్చే గ్రానైట్ క్వారీల యజమానులు ప్రస్తుతం 2.2 నుండి 2.3 క్యూబిక్ మీటర్ల వరకు ఎగుమతులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రానైట్ క్వారీల యజమానులకు లాభాలు భారీగా తగ్గుతున్నాయనే చెప్పవచ్చు. గతంలో చీమకుర్తి నుండి చెన్నై ద్వారా చైనా దేశానికి గ్రానైట్ ఎగుమతులు జరిగేవి. అక్కడ నుండి ముడిరాయిని పాలిషింగ్ చేసి టర్కీ, అమెరికా, గల్ఫ్ దేశాలకు ఎగుమతులు చేసేవారు. కానీ ప్రస్తుతం చైనానే తమ ఇంజనీర్డ్ గ్రానైట్‌ను ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్నట్లు వ్యాపార వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే గతంలో చైనాకు 70 నుండి 80 శాతం వరకు ఎగుమతి అయన గ్రానైట్ రాయి.. ప్రస్తుతం 50 నుండి 60 శాతానికి పడిపోయంది. చీమకుర్తి నుండి దిగుమతి చేసుకున్న గ్రానైట్ బండలు చైనాలో భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, గతంలో రాష్ట్రంలో గెలాక్సీ గ్రానైట్ వాడకం తక్కువగా ఉండేది. అయతే మారిన పరిస్థితుల నేపథ్యంలో గెలాక్సీ గ్రానైట్ వాడకాన్ని పెంచారు. ప్రస్తుతం రాష్టవ్య్రాప్తంగా 14.5 శాతం మేర గెలాక్సీ గ్రానైట్ విక్రయాలు పెరిగినట్లు అధికార వర్గాల సమాచారం. దీంతో చైనా ఎగుమతులు తగ్గినప్పటికి స్థానిక మార్కెట్ పుంజుకోవటంతో ఆ ప్రభావం గ్రానైట్ రంగంపై పెద్దగా చూపలేదు. అంతేగాక రానున్న రోజుల్లో వేల కోట్ల రూపాయలు వెచ్చించి అమరావతి రాజధానిని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. ఈ క్రమంలో గ్రానైట్ వాడకం కూడా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. అమరావతికి చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్‌ను వాడితే మాత్రం చైనాకు రానున్న రోజుల్లో భారీగా ఎగుమతులు తగ్గినప్పటికి ఆ ప్రభావం ఏమాత్రం ఉండదన్న అభిప్రాయాన్ని గ్రానైట్ క్వారీల యజమానులు పేర్కొంటున్నారు.
సహకారమందిస్తాం
గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుం దని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం ఇక్కడ జెడ్పీ సమావేశమందిరంలో ఫెడరేషన్ ఆఫ్ ఏపీ గ్రానైట్ ఇండస్ట్రీ, ఉత్తరాంధ్ర ఓనర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ గ్రానైట్ పరిశ్రమ.. కార్మికులకు ఉపాధి కల్పించేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, ఎంపి రామ్మోహన్‌నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఉత్తరాంధ్ర గ్రానైట్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు కె మురళీధర్, హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.