బిజినెస్

నేటినుంచి పూర్తిస్థాయిలో జియో 4జి సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: సోమవారంనుంచి దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులు రిలయన్స్ జియో 4జి సేవలను పూర్తిస్థాయిలో అందుకోవచ్చు. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ సంచలన 4జి సేవలను అన్ని 4జి ఆధారిత మొబైల్ వినియోగదారులు కావాలనుకుంటే పొందే సౌకర్యం వస్తోంది. ఇప్పటిదాకా కేవలం రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉన్న జియో సిమ్‌లు.. ఇకపై మల్టీ-బ్రాండ్ ఔట్‌లెట్లు, మొబైల్ ఫోన్ షాపుల్లోనూ లభిస్తాయి. ‘దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల స్టోర్లలో జియో సిమ్‌లు అందుబాటులోకి రానున్నాయి. వీటిని సాధారణ మొబైల్ షాపు వ్యాపారులూ విక్రయిస్తారు.’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. టెస్ట్ సిగ్నల్స్‌లో భాగంగా ఇప్పటికే 1.5 మిలియన్ల యూజర్లను జియో అందుకుంది. 100 మిలియన్ల యూజర్ల లక్ష్యంతో ముందుకెళ్తున్న జియో.. సోనీ, సాన్‌సూయ్, వీడియోకాన్, ఎల్‌జి, సామ్‌సంగ్, మైక్రోమ్యాక్స్, పానసోనిక్, అసూస్, టిసిఎల్, అల్కటెల్, హెచ్‌టిసి, ఇంటెక్స్, వివో, జియోని, కార్బన్, లావా మొబైల్ వినియోగదారులకు 90 రోజులపాటు అపరిమిత ఉచిత కాల్స్, హైస్పీడ్ మొబైల్ బ్రాడ్‌బాండ్‌ను జియో టెస్ట్ సిగ్నల్స్‌లో భాగంగా అందిస్తున్నది తెలిసిందే. సెప్టెంబర్ 5 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ ఉచిత ఆఫర్ చెల్లుబాటు అవుతుంది.