బిజినెస్

సేంద్రీయ రొయ్యలే కొంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, సెప్టెంబర్ 4: రొయ్యల సాగులో యాంటీబయోటిక్స్ వినియోగం మరోసారి దేశీయ ఎగుమతి రంగాన్ని కుదిపేస్తోంది. యాంటీ బయోటిక్స్ అవశేషాలున్న రొయ్యలను పలు దేశాలు తిరస్కరిస్తున్నాయి. కంటైనర్లకు కంటైనర్లు వెనక్కు తిరిగిరావడంతోపాటు, విదేశీ సంస్థల నుండి పెద్ద మొత్తంలో చెల్లింపులు సైతం నిలిచిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం సేంద్రీయ పద్ధతిలో సాగుచేసిన రొయ్యలను మాత్రమే కొనుగోలు చేయాలని సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారుల సంఘం ఎపి రీజియన్ నిర్ణయించింది. అలాగే యాంటీ బయోటిక్స్ ఫ్రీ అని సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) నుండి ధ్రువీకరణ పత్రం తీసుకొస్తేనే కొనుగోలు చేయాలని కూడా నిర్ణయించింది. అంతేగాక యాంటీ బయోటిక్స్ వినియోగించిన చెరువుల్లోని రొయ్యల కొనుగోళ్లు సోమవారం నుంచి నిలిపి వేయాలని తీర్మానించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆదివారం యాంటీబయోటిక్స్ దుష్పరిణామాలపై రైతులు, ట్రేడర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఈ మేరకు ప్రకటించారు. సమావేశంలో పాల్గొన్న ఎగుమతిదారుల సంఘం ఎపి రీజియన్ అధ్యక్షుడు ఎ ఇంద్రకుమార్ మాట్లాడుతూ ఏటా భారత్ నుండి సుమారు 33 వేల కోట్ల రూపాయల విలువైన సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయన్నారు. అయతే యాంటీ బయోటిక్స్ అవశేషాల కారణంగా ఇటీవలి కాలంలో చాలా దేశాలు భారత్‌కి చెందిన రొయ్యలను తిరస్కరిస్తున్నాయన్నారు. ఇప్పటికే అమెరికా వంటి పెద్ద దేశాలు ఇండోనేషియా, థాయ్‌లాండ్, వియత్నాం వంటి దేశాల నుండి రొయ్యల కొనుగోళ్లు నిలిపి వేశాయని గుర్తుచేశారు. భారత రొయ్యలకు అతిపెద్ద మార్కెట్ అమెరికాయేనని, ఈ దృష్ట్యా నాణ్యమైన రొయ్యలను ఉత్పత్తి చేయాల్సిన బాధ్యత రైతులపై ఉందన్నారు. సమావేశంలో పాల్గొన్న ఆనంద గ్రూపు ప్రతినిధి ఉద్దరాజు రమేష్‌వర్మ మాట్లాడుతూ ఇప్పటికే మన రొయ్యల కంటైనర్లు వివిధ దేశాల్లోని ఆహార తనిఖీ శాఖ వద్ద అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. రొయ్యలు నాణ్యమైనవి కావని తనిఖీల్లో తేలితే ఏడాది పాటు ఆయా కంపెనీల రొయ్యల కొనుగోళ్లు నిలిపివేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర రొయ్యల ఎగుమతి సంస్థల ప్రతినిధులు, రైతులు, కమిషన్‌దారులు సదస్సులో పాల్గొన్నారు.

సదస్సులో మాట్లాడుతున్న ఇంద్రకుమార్