బిజినెస్

రూ. 911 కోట్ల విద్యుత్ ఆదా లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 4: ఆంధ్రప్రదేశ్‌లో ఎల్‌ఇడి బల్బులు అమర్చినందు వల్ల ఇంతవరకు రూ. 911 కోట్ల విలువ చేసే విద్యుత్‌ను ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ ఆదివా రం తెలిపారు. ఒక ఎల్‌ఇడి బల్బును అమర్చితే సాలీనా 73.7 యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేస్తామన్నారు. రా ష్ట్రంలోని 13 జిల్లాల్లో 232 లక్షల ఎల్‌ఇడి బల్బులు అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో 190 లక్షల ఎల్‌ఇడి బల్బులను పంపిణీ చేశామని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 26 లక్షలకు 24 లక్షల ఎల్‌ఇడి బల్బులు పంపిణీ చేశామని, దీంతో 102 కోట్ల రూపాయలను ఆదా చేయవచ్చ న్నారు. కాగా, నాలుగు జిల్లాల్లో థర్డ్ పార్టీ చేత విద్యుత్ ఆదాపై సర్వే చేయించామన్నారు. మిగిలిన జిల్లాల్లో ఈ సర్వే కొనసాగుతుందన్నారు. ఎల్‌ఇడి బల్బుల వల్ల విద్యుత్ ఆదా అవుతుందని, పర్యావరణ కాలుష్యం తగ్గుతుందని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో ఐదు నక్షత్రాల రేటెడ్ ఫ్యాన్లను వాయిదాల పద్ధతిపై వినియోగదారులకు పంపిణీ చేస్తున్నామన్నారు. కేంద్రం కూడా ఈ పద్ధతిని ప్రశంసించడమే కాకుండా దేశంలో ఇతర రాష్ట్రాలు విద్యుత్ ఆదా కోసం అమలు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ఈ నెల 6వ తేదీన ఇంధన శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్ర ఇంధన సంరక్షణ సంఘం సమావేశం జరుగుతుంది. దీనికి డిస్కాంల సిఎండిలు, ఇంధన శాఖ సలహాదారు రంగనాథం, ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్ హాజరుకానున్నారు. అన్ని జిల్లాల్లో పట్టణాలు, గ్రామాల వారీగా అవసరమైన ఫ్యాన్లు, లైట్ల గణాంక వివరాలను వెంటనే తెలియచేయాలని ఆదేశించినట్లు అజయ్ జైన్ తెలిపారు.