బిజినెస్

జిఎస్‌టి బిల్లు జాప్యంపై అసోచామ్ అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వస్తు, సేవల పన్ను(జిఎస్‌టి) బిల్లు ఆమోదం పొందకపోవడం పట్ల పారిశ్రామిక సంఘం అసోచామ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్లమెంటు సభ్యుల నుంచి దేశం మరింత మెరుగైన పనితీరును కోరుకుంటోందని వ్యాఖ్యానించింది. ‘దేశంలో ఇప్పటిదాకా ఎప్పుడూ తయారు చేయని అత్యంత ముఖ్యమైన పన్ను సంస్కరణ అయిన జిఎస్‌టిని ప్రవేశపెట్టడానికి అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించడానికి మరో అవకాశాన్ని మనం కోల్పోయాం. అభివృద్ధి చాలా ముఖ్యమైన తరుణంలో దేశ జిడిపిని 1.5 శాతం మేర పెంచే ఒక ముఖ్యమైన సంస్కరణను కొన్ని రాజకీయ పార్టీల కారణంగా ఆమోదించలేకపోవడం దురదృష్టకరం. మన పార్లమెంటు సభ్యుల నుంచి దేశం మరింత మెరుగైన పనితీరును కోరుకొంటోంది’ అని అసోచామ్ నూతన అధ్యక్షుడు సునీల్ కనోరియా అన్నారు. ఇదిలాఉండగా జిఎస్‌టి అమలులో కొనసాగుతున్న జాప్యం ఆందోళన కలిగించే అంశం అని జిఎస్‌టి బిల్లును ఆమోదించాలంటూ సిఐఐ ఆన్‌లైన్‌లో పంపిన అభ్యర్థనలో అభిప్రాయపడింది.