బిజినెస్

రాజన్‌కు వీడ్కోలు.. పటేల్‌కు స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 4: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) 24వ గవర్నర్‌గా 52 ఏళ్ల ఉర్జిత్ పటేల్ నియామకం ఆదివారం నుంచి అమలులోకి వచ్చింది. రఘురామ్ రాజన్ స్థానంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉర్జిత్ పటేల్‌ను ఎంపిక చేయగా, దానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలిపినది తెలిసిందే. మూడేళ్లపాటు ఆర్‌బిఐ గవర్నర్‌గా పనిచేసిన ‘రాక్‌స్టార్’, ‘బాండ్ ఆఫ్ మింట్ స్ట్రీట్’ రాజన్‌కు శనివారమే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వీడ్కోలు విందునిచ్చింది కూడా. ఇక ఉర్జిత్ పటేల్ మూడేళ్లపాటు ఆర్‌బిఐ గవర్నర్‌గా సేవలందించనున్నారు. ఇప్పటిదాకా ఆయన ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌గా పనిచేయగా, ఆర్‌బిఐ చరిత్రలో డిప్యూటీ హోదాలో ఉంటూ గవర్నర్ స్థాయికి ఎదిగినవారిలో పటేల్ ఎనిమిదోవారు.

‘వచ్చే నెలాఖర్లో ఎస్‌బిఐ మెగా విలీనం ప్రారంభం’

ముంబయి, సెప్టెంబర్ 4: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. తమ అనుబంధ బ్యాంకుల విలీనాన్ని వచ్చే నెలాఖరు నుంచి మొదలుపెట్టనుంది. భారతీయ మహిళా బ్యాంక్‌తోసహా స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా బ్యాంకుల విలీనం అక్టోబర్ ఆఖర్లో మొదలై వచ్చే ఏడాది మార్చికల్లా పూర్తి కావచ్చన్న ఆశాభావాన్ని ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఆదివారం పిటిఐకిచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తం చేశారు. గ్రీవాన్స్ కమిటీ ఈ నెలాఖర్లో తిరిగి వస్తుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చిన ఆమె ఆ తర్వాత ఆర్‌బిఐని, కేంద్ర ప్రభుత్వాన్ని తుది ఆమోదం కోసం సంప్రదిస్తామని చెప్పారు.

వొడాఫోన్ అంతర్జాతీయ రోమింగ్ ఆఫర్లు

హైదరాబాద్, సెప్టెంబర్ 4: విదేశాల్లో పర్యటించే కస్టమర్ల కనెక్టివిటీ కోసం ఇంటర్నేషనల్ రోమింగ్ డెయిలీ ప్యాక్‌లను ఆవిష్కరిస్తున్నట్లు వొడాఫోన్ ప్రకటించింది. 34 దేశాల్లో ఈ పథకం చెల్లుబాటు అవుతుందని సంస్థ డైరెక్టర్ సందీప్ కటారియా ఆదివారం తెలిపారు. వోడాఫోన్ కనెక్షన్‌తో అత్యుత్తమ వాయిస్, డేటా ప్రయోజనాలను కస్టమర్లకు కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. కస్టమర్లు తమ ప్రయాణ ప్రణాళికకు అనుగుణంగా 120 రోజులకు ముందుగానే ప్యాక్‌లను బుక్ చేసుకోవచ్చని ఆయన వివరించారు. మరిన్ని వివరాల కోసం వొడాఫోన్ ఔట్‌లెట్లను సంప్రదించాలని సూచించారు.