బిజినెస్

క్షీణించిన ఒఎన్‌జిసి లాభం (ఏప్రిల్-జూన్ ఆర్థిక ఫలితాలు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ, ఉత్పాదక దిగ్గజం ఒఎన్‌జిసి నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 21 శాతం క్షీణించి 4,233 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) తొలి త్రైమాసికంలో లాభం 5,368 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో ఒఎన్‌జిసి స్పష్టం చేసింది. చమురు ఉత్పత్తి 2 శాతం, గ్యాస్ ఉత్పత్తి 5.55 శాతం మేర పడిపోయింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్)ల ద్వారా విక్రయిస్తున్న కిరోసిన్‌పై, ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం అమ్ముతున్న వంటగ్యాస్‌పై చమురు మార్కెటింగ్ సంస్థలకు వస్తున్న నష్టాలకుగాను ఉత్పాదక సంస్థగా ఒఎన్‌జిసి ఏటా నష్టపరిహారం ఇస్తూంటుంది. ఈ క్రమంలో గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో 1,096 కోట్ల రూపాయలను ఇచ్చింది.
భారీగా పెరిగిన గెయిల్ లాభం
రూ. 1,355 కోట్లుగా నమోదు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: ప్రభుత్వరంగ సంస్థ గెయిల్ ఇండియా లిమిటెడ్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో ఏకంగా 244 శాతం పెరిగి 1,355 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో ఇది 388 కోట్ల రూపాయలుగానే ఉన్నట్లు బుధవారం సంస్థ తెలియజేసింది. మహానగర్ గ్యాస్‌లో వాటా అమ్మకం, పెట్రో కెమికల్ వ్యాపారం పుంజుకోవడం కలిసొచ్చిందని చెప్పింది.
భెల్ లాభాల్లో వృద్ధి
రూ. 78 కోట్లుగా నమోదు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: ప్రభుత్వరంగ సంస్థ, పవర్ ఎక్విప్‌మెంట్ దిగ్గజం బిహెచ్‌ఇఎల్ (్భల్) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 77.77 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో ఇది 50.43 కోట్ల రూపాయలుగా నమోదైంది. దీంతో సంస్థ లాభం ఈసారి 54.21 శాతం వృద్ధి చెందినట్లైంది. ఇక ఆదాయం పోయినసారి 4,858.95 కోట్ల రూపాయలుగా ఉంటే, ఈసారి 5,871.78 కోట్ల రూపాయలుగా ఉంది. అమ్మకాలు లేదా కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం ఈ ఏప్రిల్-జూన్‌లో 5,721.19 కోట్ల రూపాయలుగా, నిరుడు 4,421.01 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు బుధవారం బిహెచ్‌ఇఎల్ స్పష్టం చేసింది.

ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఐపిఒకు సెబీ అనుమతి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)కు సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నుంచి ఆమోదం లభించింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా 5,000 కోట్ల రూపాయలను సంస్థ మార్కెట్ నుంచి సమీకరిస్తుందని అంచనా. ఇదే జరిగితే ఓ బీమా రంగ సంస్థ ఐపిఒ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో నిధులను సమీకరించడం దేశంలోనే తొలిసారి అవుతుంది. అంతేగాక గడచిన ఆరేళ్లలో ఇంతగా నిధులను సేకరించడం కూడా ఇదే. 2010లో కోల్ ఇండియా 15,000 కోట్ల రూపాయలకుపైగా నిధులను అందుకుంది.

జెఎల్‌ఆర్ అమ్మకాల్లో 26 శాతం వృద్ధి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) రిటైల్ అమ్మకాలు గత నెల ఆగస్టులో 36,926 యూనిట్లుగా నమోదయ్యాయి. నిరుడుతో పోల్చితే ఇది 26 శాతం అధికం. లాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, జాగ్వార్ ఎఫ్-పేస్, ఎక్స్‌ఇ అమ్మకాలు భారీగా ఉండటం కలిసొచ్చిందని బుధవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు సంస్థ తెలియజేసింది. జాగ్వార్ బ్రాండ్ వాహనాలు గతంతో పోల్చితే 104 శాతం పెరిగాయి. లాండ్ రోవర్ మోడల్స్ విక్రయాలు 9 శాతం వృద్ధి చెందాయి. కాగా, చైనాలో అమ్మకాలు 36 శాతం పెరిగితే, బ్రిటన్‌లో 3 శాతం తగ్గాయి. ఇతర విదేశీ మార్కెట్లలోనూ 2 శాతం పడిపోయాయి.