బిజినెస్

యుబిఎల్ వ్యాపారం బాగానే ఉంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, సెప్టెంబర్ 7: రుణ ఎగవేత కేసును, కోర్టుల నుంచి సమన్లను ఎదుర్కొంటున్న లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా.. యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యుబిఎల్) వాటాదారులకు బుధవారం ఓ లేఖ రాశారు. ఇక్కడ జరిగిన యుబిఎల్ వార్షిక సాధారణ సమావేశంలో ఈ లేఖను చదివి వినిపించగా, ఇందులో యుబిఎల్ ఉత్పత్తులు ఇక ముందూ కొనసాగుతాయని, మార్కెట్‌లోకి కొత్త ఉత్పత్తులు కూడా వస్తాయని మాల్యా స్పష్టం చేశారు. రుణాల ఎగవేత కేసులో మాల్యా ఆస్తుల జప్తు నేపథ్యంలో పైవిధంగా స్పందించారు. వేల కోట్ల రుణాలను బ్యాంకుల నుంచి తీసుకుని వాటిని ఎగవేసిన మాల్యా.. ప్రస్తుతం లండన్‌లో ఉన్నది తెలిసిందే.
మారుతి ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
గుర్గావ్, సెప్టెంబర్ 7: హర్యానాలోని గుర్గావ్‌లోగల మారుతి సుజుకి ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి రాగా, వాహనాల బల్బుల తయారీ విభాగంలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇందులో ప్రాణనష్టం జరగలేదని తెలుస్తున్నా.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు వినిపిస్తోంది.