బిజినెస్

ఈసారి జిడిపి వృద్ధిరేటు 7.5 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: దేశ జిడిపి వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో 7.5 శాతానికి పెరగవచ్చని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డిఅండ్‌బి) అంచనా వేసింది. భారత చమురు అవసరాలు ఎక్కువగా విదేశీ దిగుమతుల ద్వారానే తీరుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పడిపోయిన ముడి చమురు ధరలు దేశ జిడిపి వృద్ధిరేటు పురోగతికి దోహదపడగలదని డిఅండ్‌బి అభిప్రాయపడింది. అలాగే సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో పెరిగే వ్యవసాయం గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ సామర్థ్యాన్ని బలపరుస్తుందని, 7వ వేతన సంఘం సిఫార్సుల అమలు కూడా కలిసొస్తోందని, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి), దివాళా బిల్లు, డెట్ రికవరీ బిల్లు తదితర కీలక సంస్కరణలు తీసుకురావడం కూడా ఆర్థిక వృద్ధికి కారణమవుతున్నాయని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో భారత జిడిపి వృద్ధిరేటు 7.2 శాతంగా నమోదైనది తెలిసిందే.
బ్రిటన్ మార్కెట్‌లోకి
భారతీయ బిపివో సంస్థ ఒరేమస్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 7: బ్రిటన్ మార్కెట్‌లోకి భారతీయ బిపివో సంస్థ ఒరేమస్ ప్రవేశించింది. చిన్న, మధ్యతరహా వ్యాపార శ్రేణికి చెందిన ప్రముఖ బిపివో కంపెనీ అయన ఒరేమస్.. యూకె మార్కెట్‌లోకి అడుగు పెట్టడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లోకి విస్తరించినట్లయ్యిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ రంగంలో తన నాయకత్వాన్ని మరింత మెరుగుపరచుకుంటూ, అత్యంత ప్రాధాన్యత కలిగిన బిపివో సర్వీస్ ప్రొవైడర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నదని వారు వివరించారు.