బిజినెస్

జిఎస్‌టికే తొలి ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలే తమ ప్రధాన లక్ష్యమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పునరుద్ఘాటించారు. ఈ చారిత్రాత్మక పరోక్ష పన్ను విధానం ఒకసారి ఆచరణలోకి వస్తే పన్ను రేట్లు తగ్గుతాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వరంగ బ్యాంకులను తిరిగి గాడిలో పెట్డడం అన్నది తమ ముందున్న అతిపెద్ద సవాల్ అని జైట్లీ అన్నారు. బుధవారం ఇక్కడ జరిగిన ‘ది ఎకనామిస్ట్-ఇండియా సమ్మిట్ 2016’ కార్యక్రమంలో పాల్గొన్న జైట్లీ.. మాట్లాడుతూ జిఎస్‌టిపై అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానం చేస్తున్నాయని, మెజారిటీ రాష్ట్రాలు మద్దతు పలుకుతున్నాయని చెప్పారు. ఇవన్నీ కూడా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం పొందాల్సి ఉందని, అది జరిగితే జిఎస్‌టికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు చట్టబద్ధత లభిస్తుందని తెలిపారు. ఈ ప్రక్రియ అంతా కూడా వేగంగానే జరుగుతుందన్న ఆయన తర్వాత జిఎస్‌టి కమిటీని ఏర్పాటు చేస్తామని, అపరిష్కృతంగా ఉన్న కొన్నింటిని ఈ కమిటీ పరిష్కరిస్తుందని చెప్పారు. కాగా, బ్యాంకింగ్ రంగాన్ని, ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు) విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని జైట్లీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అవసరమైతే ప్రస్తుత 2016-17 బడ్జెట్‌లో సూచించినదానికంటే కూడా అధికంగా బ్యాంకులకు నిధులను అందిస్తామని మరోసారి చెప్పారు.
మల్టీ-బ్రాండ్ రిటైల్ రంగంలోకి
ఎఫ్‌డిఐపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: సీతారామన్
మల్టీ-బ్రాండ్ రిటైల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ‘ది ఎకనామిస్ట్-ఇండియా సమ్మిట్ 2016’ కార్యక్రమానికి హాజరైన నిర్మలా సీతారామన్.. చిరు వ్యాపారులు, రైతులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోబోమని భరోసా ఇచ్చారు. వారి సాధికారతను పణంగా పెట్టి మల్టీ-బ్రాండ్ రిటైల్ రంగంలోకి ఎఫ్‌డిఐని ఆహ్వానిస్తే మార్కెట్‌లో వారు గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఇది ప్రభుత్వ సిద్ధాంతానికి సరికాదన్నారు. కాగా, మల్టీ-బ్రాండ్ రిటైల్‌లోకి ఎఫ్‌డిఐపై అధికార బిజెపి మొదటి నుంచి వ్యతిరేకతను కనబరుస్తున్నది తెలిసిందే. ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ దీన్ని మోదీ సర్కారు పెట్టింది. ఇకపోతే వివిధ దేశాలతో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను పునఃపరిశీలిస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.