బిజినెస్

ఈ ఏడాది రుణ పంపిణీ లక్ష్యం రూ.40 వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 9: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) హౌసింగ్ ఫైనాన్స్ విభాగం తమ ఖాతాదారులకు 40 వేల కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో 34 వేల కోట్ల రుణాలను పంపిణీ చేయాలన్న లక్ష్యాన్ని తమ సంస్థ అధిగమించిందని ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఎండి, సిఇఓ సునీతా శర్మ శుక్రవారం చెన్నైలో తెలిపారు. ‘గత ఏడాది మా సంస్థ వ్యాపారం 19 నుంచి 20 వరకు, లాభాలు 20 శాతం మేరకు పెరిగాయి. దీంతో ఖాతాదారులకు 34 వేల కోట్ల రుణాల పంపిణీ చేయాలన్న లక్ష్యాన్ని అధిగమించిన మేము ఈ ఏడాది 40 వేల కోట్ల రుణాలను పంపిణీ చేయాలని భావిస్తున్నాం’ అని సునీతా శర్మ స్పష్టం చేశారు.