బిజినెస్

‘ప్రభుత్వ కొనుగోళ్లలో పోటీతో ద్రవ్యలోటు మాఫీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: ప్రభుత్వ కొనుగోళ్ల కోసం జరిపే బిడ్డింగ్ ప్రక్రియలో కాంపిటేషన్ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) చైర్మన్ డికె సిక్రీ శుక్రవారం గట్టిగా కోరుతూ, అలా చేసినట్లయితే ఈ దేశ ద్రవ్య లోటు అంతా తుడిచిపెట్టుకు పోయేలా చేయవచ్చని అభిప్రాయ పడ్డారు.‘ ప్రభుత్వ ఏజన్సీలు గనుక ఇప్పటిలాగా అప్రమత్తమై బిడ్డింగ్ ప్రక్రియలో కాంపిటేషన్‌ను కచ్చితంగా అమలుచేసినట్లయితే, ప్రభుత్వ కొనుగోళ్లలో కనీసం 2 శాతం ఆదా అయినా బడ్జెట్‌లో ఆర్థిక లోటును పూర్తిగా తుడిచిపెట్టవచ్చు’నని ఇక్కడొక కార్యక్రమంలో మాట్లాడుతూ సిక్రీ అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కొనుగోళ్లు జరిపేటప్పుడు కాంపిటేషన్ చట్టం ప్రభుత్వానికి ఎంతగానో సహాయపడుతుందని కూడా ఆయన అన్నారు. కాంట్రాక్టర్లు రింగ్‌గా ఏర్పడ్డం, కుమ్మక్కు కావడం లాంటి కేసులు వివిధ కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంటులు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలనుంచి కమిషన్‌కు భారీ సంఖ్యలో వస్తున్నాయని, వీటిపై దర్యాప్తు జరుపుతున్నామని సిక్రీ చెప్పారు. ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ శాఖల్లో ఇప్పుడు కాంపిటేటివ్ బిడ్డింగ్ గురించి చైతన్యం ఎక్కువ అయిందని కూడా ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ మార్పు ప్రభుత్వం జరిపే కొనుగోళ్లలో పెద్దఎత్తున ఆదాకు దోహదపడే అవకాశం ఉందని కూడా సిక్రీ చెప్పారు.