బిజినెస్

మార్కెట్ల జోరుకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 9: గత కొద్ది రోజులుగా కొనుగోళ్ల మద్దతుతో రికార్డు స్థాయికి చేరుకున్న దేశీయ మార్కెట్లు శుక్రవారం అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు సైతం మార్కెట్ల పతనానికి కారణమైనాయి. ఫలితంగా బిఎస్‌ఇ సెనె్సక్స్ 248 పాయింట్లు నష్టపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం దాదాపుగా 86 పాయింట్లు నష్టపోయింది. వచ్చేవారం కీలకమైన పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలతో పాటుగా వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం(సిపిఐ) వివరాలు వెల్లడి కానున్న నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరించారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఇసిబి) ఉత్ప్రేరక చర్యలు ప్రకటించ రాదన్న తాజా నిర్ణయం కారణంగా కూడా మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నదని విశే్లషకులు అభిప్రాయ పడ్డారు. అయితే గురువారం తీవ్రంగా దెబ్బతిన్న ఐటి, రియల్టీ రంగాలు శుక్రవారం చాలావరకు కోలుకున్నాయి. నిన్న దారుణంగా నష్టపోయిన టిసిఎస్ షేరు ఈ రోజు లాభాలు ఆర్జించిన వాటిలో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. అయితే ఆటో, మెటల్, ఎఫ్‌ఎంసిజి, బ్యాకింగ్ రంగాలకు చెందిన షేర్లు నష్టపోయాయి. వంద కోట్ల డాలర్ల నిధులు సేకరించాలన్న ఆలోచనను యెస్ బ్యాంక్ వాయిదా వేసుకోవడంతో ఆ బ్యాంక్ షేరు 4 శాతం పడిపోయింది. అలాగే దేశంలో అతి పెద్ద ఉక్కు తయారీ కంపెనీ సెయిల్ నష్టాలు జూన్ త్రైమాసికంలో మరింతగా పెరగడంతో ఆ షేరు 6 శాతం నష్టపోయింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు సైతం నష్టాల్లో ముగిశాయి. సెనె్సక్స్ అయితే మొత్తంమీద ఈ వారంలో బిఎస్‌ఇ సెనె్సక్స్ 265 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 57 పాయింట్లు లాభపడింది.
నిన్న 29 వేల పాయింట్ల స్థాయిలో ముగిసిన సెనె్సక్స్ ఈ రోజు అదే స్థాయిలోనే ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో 28,755 పాయింట్ల స్థాయికి పడిపోయిన సెనె్సక్స్ చివరికి 248 పాయింట్ల నష్టంతో 28,797.25 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 85.89 పాయింట్లు నష్టపోయి 8,866.70 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా అంతర్జాతీయ మార్కెట్లలో ప్రధాన ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్లు కూడా నష్టాలతోనే మొదలైనాయి. సెనె్సక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 22 షేర్లు నష్టపోగా, కోల్ ఇండియా స్థిరంగా కొనసాగింది. ప్రధానంగా నష్టపోయిన వాటిలో యాక్సిస్ బ్యాంక్, ఐటిసి, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్ ఆటో, సిప్లా, మారుతి, ఎస్‌బిఐ షేర్లు ఉన్నాయి.