బిజినెస్

ఆర్‌ఇఐటి, ఐఎన్‌విఐటిలకు వెసులుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 9: దేశంలో పెట్టుబడులకు ఊతమివ్వాలని భావిస్తున్న మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీ ఈ నెలలో రియల్ ఎస్టేట్ ఇనె్వస్ట్‌మెంట్ ట్రస్టుల (ఆర్‌ఇఐటిల)తో పాటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇనె్వస్ట్‌మెంట్ ట్రస్టుల (ఐఎన్‌విఐటిల)కు సంబంధించిన నియమ నిబంధనలను సడలించాలని యోచిస్తోంది. ఈ అంశంపై ఈ నెలలో జరుగనున్న తమ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, దీంతో ఈ ఏడాది ఆర్‌ఇఐటి, ఐఎన్‌విఐటిల ఏర్పాటు వేగం పెరుగుతుందని ఆశిస్తున్నామని మున్సిపల్ బాండ్లపై గురువారం ముంబయిలో జరిగిన సమావేశం సందర్భంగా సెబీ చైర్మన్ యుకె.సిన్హా తెలిపారు. ఆర్‌ఇఐటిలు, ఐఎన్‌విఐటిల రిజిస్ట్రేషన్‌కు అనేక దరఖాస్తులు వచ్చాయని, అయితే ప్రస్తుతం ఉన్న నియమ నిబంధనలను సడలించాలని పలువురు దరఖాస్తుదారులు విజ్ఞప్తి చేయడంతో ఆ దిశగా కసరత్తు చేస్తున్నామని సిన్హా వివరించారు. ఆర్‌ఇఐటిలు, ఐఎన్‌విఐటిలకు సంబంధించిన నిబంధనలను సెబీ 2014లో రూపొందించింది. అయితే ఈ వాహకాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు పన్ను చెల్లింపుల్లో వెసులుబాట్లు కల్పించడంతో పాటు మరిన్ని చర్యలు చేపట్టాలని అనేక మంది దరఖాస్తుదారులు కోరుతుండటంతో ఇప్పటివరకూ ఒక్క ట్రస్టు మాత్రమే ఏర్పాటైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ ట్రస్టులకు పన్నుల విషయంలో కొన్ని రాయితీలు కల్పించగా, ఈ ట్రస్టులకు సంబంధించిన నియమ నిబంధనలను మరింత సడలించాలని సెబీ భావిస్తోంది.