బిజినెస్

జియో.. మొర్రో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: నెట్‌వర్క్ ఇంటర్ కనెక్టివిటీ విషయమై సెల్యులార్ ఆపరేటర్ల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న వివాదం ముదురుతోంది. దీంతో ఈ వివాదంపై చర్చించేందుకు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలతో టెలికామ్ నియంత్రణా సంస్థ ట్రాయ్ శుక్రవారం సమావేశం జరిపింది. అయితే ఈ సమావేశానికి సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సిఓఎఐ) అధికారులను దూరంగా ఉంచింది. దాదాపు గంటసేపు జరిగిన ఈ సమావేశం ముగిసిన తర్వాత రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ బోర్డు సభ్యుడు మహేంద్ర నహతా విలేఖర్లతో మాట్లాడుతూ, తాము న్యాయం కోసం, వినియోగదారుల సంక్షేమం కోసం పోరాడుతున్నామని, కేవలం రిలయన్స్ జియో ఖాతాదారుల కోసమో లేక ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఖాతాదారుల కోసమో కాకుండా దేశంలోని టెలికామ్ ఖాతాదారులందరి కోసం పోరాడుతున్నామని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర ఆపరేటర్ల మొబైల్ నెట్‌వర్క్‌లతో తమ నెట్‌వర్క్‌ను అనుసంధానించేందుకు అవసరమైనంత సంఖ్యలో పరికరాలను అందజేయడం లేదని రిలయన్స్ జియో ఆరోపించింది. ‘సరైన సంఖ్యలో కనెక్షన్లు, సరైన పరిమాణంలో ఇంటర్ కనెక్టివిటీ ఇవ్వాలని మేము కోరాం. ఈ విషయమై ట్రాయ్‌కి మా వాదన వినిపించాం. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది టెలికామ్ నియంత్రణా సంస్థే. అయితే ఈ సమస్యను ఎప్పటిలోగా పరిష్కరిస్తారన్నదీ ట్రాయ్ చెప్పలేదు’ అని నహతా తెలిపారు.
ఒక ఆపరేటర్‌కు చెందిన వినియోగదారులు ఇతర ఆపరేటర్ల వినియోగదారులకు కాల్స్ చేయాలంటే ఇంటర్ కనెక్టివిటీ అవసరమవుతుంది. టెలికామ్ సంస్థల పరస్పర అవగాహనపై ఆధారపడి ఉండే ఇంటర్ కనెక్టివిటీ విషయంలో ఏదైనా వివాదం తలెత్తితే నిబంధన ప్రకారం ఆ విషయాన్ని ట్రాయ్ దృష్టికి తీసుకెళ్లాలి. దీనిపై ట్రాయ్ నిర్ణయం తీసుకుని సమస్యను పరిష్కరిస్తుంది. అయితే ఇంటర్ కనెక్టివిటీ విషయంలో సిఓఎఐ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా తదితర ఆపరేటర్లకు అండగా నిలబడి రిలయన్స్ జియోను ప్రతిఘటిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రిలయన్స్ జియో అభీష్ఠం మేరకే తమను టాయ్ సమావేశానికి దూరంగా ఉంచిందని సిఓఎఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్.మాథ్యూస్ ఆరోపించారు. ఇంటర్ కనెక్టివిటీ సమస్య గురించి చర్చించేందుకు శుక్రవారం ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియా సంస్థలతో నిర్వహించే సమావేశం కేవలం ఆ మూడు సంస్థలకు మాత్రమే సంబంధించినది కాదని, కనుక సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్‌లోని సభ్యులందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించాలని కోరుతూ సిఓఎఐ గురువారమే ట్రాయ్‌కి లేఖ రాసింది.