బిజినెస్

విదేశీ నిపుణులను ఆకర్షించేందుకు ఒకే వర్క్ వీసా జారీ చేయనున్న చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, సెప్టెంబర్ 9: నిపుణులైన విదేశీ కార్మికులను ఆకర్షించడం కోసం చైనా ప్రభుత్వం పలు అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా ఇప్పుడు ఇస్తున్న రెండు రకాల విదేశీ వర్క్ పర్మిట్‌ల స్థానంలో ఒకే వర్క్ వీసా సిస్టమ్‌ను తీసుకు రావాలని అనుకుంటోంది. దీనివల్ల ఒకే వ్యక్తి రెండు దరఖాస్తులు చేసుకోవడం లాంటివి లేకుండా చేయడానికి దోహదపడ్డమే కాకుండా కమ్యూనికేషన్ సైతం మెరుగుపడుతుందని, నిపుణులైన విదేశీ కార్మికులను చైనాకు ఆకర్షించడానికి మరింతగా ఉపయోగపడుతుందని ప్రభుత్వ విదేశీ నిపుణుల వ్యవహారాల విభాగం అధిపతి ఝాంగ్ జియాంగువా చెప్పారు. బీజింగ్, షాంఘై, తియాంజిన్ మున్సిపాలిటీల్లో దీనికి సంబంధించి ట్రయల్స్ జరుగుతున్నాయని, మరి కొన్ని ప్రాంతాల్లో అక్టోబర్‌లో మొదలవుతాయని ప్రభుత్వ అధీనంలోని ‘చైనా డైలీ’ పత్రిక తెలిపింది. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం విదేశీ వర్కర్లు మానవ వనరుల మంత్రిత్వ శాఖ జారీ విదేశీ కార్మికులకు జారీ చేసే ఎంప్లాయ్‌మెంట్ లైసెన్స్‌కు గానీ, విదేశీ వర్కర్ల వ్యవహారాల విభాగం జారీ చేసే విదేశీ నిపుణుల వర్క్ పర్మిట్‌కు కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే చట్టబద్దంగా చూస్తే ఈ రెండింటికీ తేడా ఏమిటో చెప్పడం కష్టమని బీజింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇమిగ్రేషన్ చట్టంలో ప్రొఫెసర్ అయిన లియు గౌఫు అన్నారు. అవసరమైన విదేశీ నిపుణులను ఆకర్షించడానికి, దేశాభివృద్ధికి ఈ సంస్కరణ దోహదం చేస్తుందని ఝాంగ్ అభిప్రాయ పడ్డారు.