బిజినెస్

ద్వైపాక్షిక వాణిజ్య అభివృద్ధి ధ్యేయంగా ఇండో-అమెరికా ఆర్థిక సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: న్యూఢిల్లీలో ఈ నెల 14వ తేదీ నుంచి రెండు రోజుల పాటు భారత్-అమెరికా వాణిజ్య శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడులను పెంపొందించుకునేందుకు అనుసరించాల్సిన మార్గాలపై ఇరు దేశాలకు చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు వ్యాపార, విద్యా రంగాల నిపుణులు ఈ సదస్సులో చర్చ జరుపనున్నారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంపొందించడంపై చర్చించడంతో పాటు వేగవంతమైన అభివృద్ధికి అవకాశాలున్న రంగాలపై ఈ సదస్సు దృష్టి కేంద్రీకరిస్తుందని ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇండో-అమెరికన్ చాంబర్ ఉత్తర భారత మండలి (నార్త్ ఇండియా కౌన్సిల్) ఆధ్వర్యంలో జరుగనున్న ఈ సదస్సును భారత్‌లోని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ ప్రారంభిస్తారు. సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ సహా పలువురు కేంద్ర మంత్రులు, అంతర్జాతీయ సంస్థల సిఇఓలు, ఉన్నతాధికారులు ఈ సదస్సులో ప్రసంగిస్తారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు సహా వ్యాపార, విద్యా, సామాజిక రంగాలకు చెందిన 250 మందికి పైగా నిష్ణాతులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.