బిజినెస్

ఏప్రిల్-సెప్టెంబర్‌లో క్షీణించిన ఉల్లి ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఉల్లిగడ్డ ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో 18 శాతం పడిపోయాయి. దేశీయంగా ఉల్లి ధరలు రికార్డు స్థాయిలో పెరిగిన నేపథ్యంలో ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలే దీనికి కారణం. గత ఆర్థిక సంవత్సరం (2014-15) ప్రథమార్ధంలో భారత్ నుంచి విదేశాలకు 5,89,900.89 టన్నుల ఉల్లి ఎగుమతులు జరగగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 4,85,930.51 టన్నుల ఎగుమతులు జరిగాయి. ఈ మేరకు నేషనల్ హార్టికల్చరల్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌డిఎఫ్) తెలిపింది.
అకాల వర్షాల కారణంగా ఉల్లి దిగుబడులు గణనీయంగా క్షీణించగా, హోల్‌సేల్ మార్కెట్‌లోనే కిలో ధర 60 రూపాయల నుంచి 100 రూపాయల వరకు చేరింది. దీంతో ఉల్లి కనీస ఎగుమతి ధరను దాదాపు 50 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎగుమతులు పతనమయ్యాయి.