బిజినెస్

మార్కెట్‌లోకి హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఆటోమేటిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: హ్యుందాయ్ మోటార్ ఇండియా.. దేశీయ మార్కెట్‌కు మంగళవారం ఓ సరికొత్త వాహనాన్ని పరిచయం చేసింది. ఇప్పటికే ఉన్న తమ హచ్‌బ్యాక్ ఎలైట్ ఐ20ని ఆటోమేటిక్ వేరియంట్‌లో తీసుకొచ్చింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర 9.01 లక్షల రూపాయలు. ఫోర్ స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 1.4 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగిన ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగులు, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, హైట్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్ బెల్టులు తదితర అదనపు భద్రతా సదుపాయాలు కూడా ఉన్నాయి.
‘ప్రీమియం కంపాక్ట్ విభాగంలో హ్యుందాయ్ ఐ20 మంచి ప్రదర్శనను కనబరుస్తోంది. నాణ్యత, డిజైన్, పనితీరు, ప్రీమియం ఫీచర్లలో హ్యుందాయ్ మంచి పేరును సంపాదించుకుంది’. అని హ్యుందాయ్ మోటార్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ సీనియర్ ఉపాధ్యక్షుడు రాకేశ్ శ్రీవాత్సవ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని వర్గాల వినియోగదారుల అభిరుచికి తగ్గట్లుగా ఐ20 బ్రాండ్‌ను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే భారతీయ మార్కెట్‌లో ఐ20 బ్రాండ్ ఒక మిలియన్ యూనిట్ల అమ్మకాలను దాటిందని గుర్తుచేశారు.
కాగా, భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న ప్యాసింజర్ కార్లలో హ్యుందాయ్ సంస్థకు చెందినవే అధికం. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 10 రకాల కార్లను హ్యుందాయ్ విక్రయిస్తోంది.