బిజినెస్

నౌకా నిర్మాణంలో రష్యా పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 13: నౌకా నిర్మాణ రంగంలో రష్యా ప్రభుత్వరంగ సంస్థ యునైటెడ్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ పెట్టుబడులు పెట్టనుంది. రక్షణ రంగంలో నౌకల తయారీ, ఏపి కేంద్రంగా ప్రాజెక్టు ఏర్పాటుపై ఇండో-రష్యా ప్రతినిధులు విశాఖలో మంగళవారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రష్యా షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ అధ్యక్షుడు అలెక్సీ ఎల్ రఖ్మనావ్ మాట్లాడుతూ నౌకా నిర్మాణ రంగంలో భారత్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందన్నారు. జాతీయ నౌకాయాన విధానం పరంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ రంగం అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. నౌకా నిర్మాణ రంగంలో విదేశీ పరిజ్ఞానం వల్ల 45 శాతం అదనపు భారం పడుతోందని, అయతే తయారీ రంగంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో జిడిపి 3 శాతం పెరుగుతుందన్నారు.
అలాగే ఉత్పాదకత కూడా 16 నుంచి 25 శాతం వృద్ధి సాధించే అవకాశం ఉందన్నారు. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎంతో ముందుచూపు ఉన్న వ్యక్తిగా పేర్కొన్నారు రఖ్మనావ్. గతంలో చంద్రబాబు రష్యా పర్యటన సందర్భంగా తమను ఆహ్వానించారని, దీనిలో భాగంగానే విశాఖ కేంద్రంగా నౌకా నిర్మాణ రంగంలో పరస్పర సహకారంతో పనిచేయనున్నట్టు వెల్లడించారు. ప్రతిష్ఠాత్మకమైన రష్యా షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ తరఫున విశాఖలో యూనిట్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ హెచ్‌సిఎస్ బిస్త్ మాట్లాడుతూ భారత్‌తో రష్యాకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. 2వ ప్రపంచ యుద్ధం, స్వాతంత్య్రానంతరం విశాఖలో స్టీల్ ప్లాంట్, షిప్‌యార్డు నిర్మాణాల్లో సాంకేతికంగా సహకరించారన్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సాంకేతిక సహకారం భవిష్యత్‌లో మంచి ఫలితాలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హిందూస్థాన్ షిప్‌యార్డ్ చైర్మన్ ఎల్‌వి శరత్‌బాబు మాట్లాడుతూ దేశాభివృద్ధిలో నౌకా నిర్మాణం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. నౌకా నిర్మాణ రంగంలో ఉపాధి, ఉద్యోగావకాశాలు అధికమని, ప్రత్యక్షంగా 5 లక్షల మందికి, పరోక్షంగా 10 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. వాణిజ్య, పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ రక్షణ రంగానికి భారత్ ఎంతో ప్రాధాన్యతను ఇస్తోందని, రక్షణ రంగ కేటాయింపులను 31 నుంచి 37 శాతానికి పెంచారన్నారు. రక్షణ ఉత్పత్తుల అభివృద్ధికి తొలిసారిగా ఏపి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అన్ని అవకాశాలు ఉన్నాయని, సదుపాయాల కల్పనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చెన్నై-విశాఖ, చెన్నై-బెంగళూరు మధ్య రెండు ప్రధాన కారిడార్లు ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా మేజర్, మైనర్ పోర్టులను నిర్మిస్తున్నామని వివరించారు. ఏపి ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు సిఇఒ జె కృష్ణకిషోర్ మాట్లాడుతూ 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఏపిలో పెట్టుబడులకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. సమావేశంలో ఫిక్కీ సీనియర్ డైరెక్టర్ వివేక్ పండిట్, రష్యా ప్రతినిధులు, రక్షణ శాఖ అధికారులు పాల్గొన్నారు.
chitram...
సమావేశంలో మాట్లాడుతున్న రష్యా షిప్ బిల్డింగ్ కార్పొరేషన్
అధ్యక్షుడు అలెక్స్ ఎల్ రఖ్మనవ్