బిజినెస్

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 14: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. మంగళవారం బక్రీద్ సందర్భంగా సెలవు అవగా, సోమవారం సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఈ క్రమంలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 18.69 పాయింట్లు పెరిగి 28,372.23 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 11 పాయింట్లు అందుకుని 8,726.60 వద్ద నిలిచింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఇన్‌ఫ్రా, బ్యాంకింగ్, పిఎస్‌యు, ఆటో, విద్యుత్ రంగాల షేర్లు లాభాలను అందుకున్నాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో జపాన్ సూచీ నష్టపోగా, చైనా, హాంకాంగ్, సింగపూర్ సూచీలు 0.68 శాతం వరకు లాభపడ్డాయి. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలూ లాభాలను పొందాయి.

లీఎకో వినియోగదారులకూ జియో ఉచిత సేవలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో అందిస్తున్న ‘వెల్‌కమ్ ఆఫర్’లో చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ లీఎకో కూడా భాగస్వామ్యమైంది. ఈ ఏడాది ఆఖరు వరకు జియో వినియోగదారులకు ఉచితంగా 4జి సేవలను వెల్‌కమ్ ఆఫర్ అందిస్తున్నది తెలిసిందే. దీంతో ఇకపై లీఎకో 4జి స్మార్ట్ఫోన్ ఉన్నవారికీ జియో సేవలు అందుబాటులో ఉంటాయన్నమాట. ఇప్పటికే సోనీ, సాన్‌సుయ్, వీడియోకాన్, ఎల్‌జి, సామ్‌సంగ్, మైక్రోమ్యాక్స్, పానసోనిక్, అసూస్, టిసిఎల్, అల్కటెల్, హెచ్‌టిసి, ఇంటెక్స్, వివో, జియోని, కార్బన్, లావా కస్టమర్లకు జియో సేవలు అందుతున్నాయ.

మెగా స్పెక్ట్రమ్ వేలంలో అగ్రశ్రేణి టెలికామ్ సంస్థలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: మునుపెన్నడూ లేనివిధంగా వచ్చే నెల అక్టోబర్ 1న మొదలయ్యే మెగా స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు రిలయన్స్ జియోతోపాటు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ తదితర అగ్రశ్రేణి సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఇందు కు సంబంధించి దరఖాస్తులు సమర్పించాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్, టాటా టెలీసర్వీసెస్ కూడా దరఖాస్తులు దాఖలు చేశాయి. బుధవారంతో దరఖాస్తుల దాఖలుకున్న గడువు తీరిపోయింది. దరఖాస్తులు ఇచ్చిన సంస్థల వివరాలను టెలికామ్ శాఖ గురువారం ప్రకటించనుండగా, సోమవారం వీటిని పరిశీలించనుంది. ఇక దరఖాస్తుల ఉపసంహరణకు ఆఖరు తేది ఈ నెల 22గా ప్రకటించారు.