బిజినెస్

రెండేళ్ల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: టోకు ద్రవ్యోల్బణం గత నెలలో రెండేళ్ల గరిష్ఠానికి ఎగిసింది. పప్పు్ధన్యాలతోపాటు కొన్నిరకాల తయారీ ఉత్పత్తుల అధిక ధరల కారణంగా ఆగస్టులో టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3.74 శాతంగా నమోదైంది. ఇక అంతకుముందు నెల జూలైలో ఇది 3.55 శాతంగా ఉంటే, నిరుడు ఆగస్టులో మైనస్ 5.06 శాతంగా ఉంది. 2014 నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు మైనస్‌లోనే ఉన్నది తెలిసిందే. ఏప్రిల్ నుంచి క్రమేణా పెరుగుతుండగా, 2014 ఆగస్టులో 3.74 శాతంగా నమోదైంది. మళ్లీ ఆ తర్వాత ఈ ఆగస్టులోనే ఆ స్థాయిని తాకింది. అయితే ఈ జూలైలో 11.82 శాతంగా ఉన్న కూరగాయల ధరలు.. ఆగస్టులో 8.23 శాతానికి తగ్గుముఖం పట్టాయని బుధవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ద్రవ్యోల్బణం సూచీ 0.17 శాతానికి దిగివచ్చింది. కాగా, పప్పు్ధన్యాల ధరలు మాత్రం అధికంగానే ఉన్నట్లు తేలింది. ఆగస్టులో 34.55 శాతంగా ఉందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన గణాంకాలు చెబుతున్నాయి. బంగాళదుంప, చక్కెర, పండ్ల ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ ఉల్లి ధరలు మాత్రం అదుపులోనే ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.