బిజినెస్

19న ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఐపిఒ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ జీవిత బీమా సంస్థ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)ను ఈ నెల 19వ తేదీన జారీ చేయనుంది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఒక్కో ఈక్విటీ షేర్ ధరను 300 రూపాయల నుంచి 334 రూపాయల మధ్య నిర్ణయంచింది. పది రూపాయల ముఖ విలువతో 18,13,41,058 ఈక్విటీ షేర్ల వరకు తొలి ఆఫర్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ఐసిఐసిఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మృదులా మెహతా తెలిపారు. వీటిలో 1,81,34,105 ఈక్విటీ షేర్లను ఐసిఐసిఐ బ్యాంక్ షేర్ హోల్డర్ల కోసం రిజర్వు చేశారు. ఈ ఆఫర్ ఈ నెల 21వ తేదీతో ముగుస్తుంది. ఈ ఆఫర్ ద్వారా అందించే ఈక్విటీ షేర్లను నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ లిమిటెడ్, బాంబే స్టాక్ ఎక్సేంజ్ లిమిటెడ్‌లో లిస్టు చేయాలని ప్రతిపాదించారు. ఈ ఆఫర్‌కు గ్లోబల్ కో ఆర్డినేటర్స్ అండ్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్‌గా డిఎస్‌పి మెరిల్ లించ్ లిమిటెడ్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లిమిటెడ్ వ్యవహరిస్తున్నాయ