బిజినెస్

సోలార్ పంపుసెట్లకు ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 25: వ్యవసాయ ఆధారిత ప్రాంతాలైన ఉత్తర కోస్తాలో గత ఏడాది కాలంగా సోలార్ వ్యవసాయ పంపుసెట్లకు రైతుల నుంచి విశేషంగా ఆదరణ లభిస్తోంది. దీంతో అంతరాయాల్లేని విద్యుత్ సరఫరాను రైతులు పొందగలుగుతున్నారు. ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) పరిధిలో ఐదు జిల్లాలకు సంబంధించి ఇది సాధ్యపడటంతో ఈ పథకాన్ని పూర్తిస్తాయిలో విస్తరించాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. సంస్థ పరిధిలో ఐదు జిల్లాలకు సంబంధించి రెండు లక్షల ఐదు వేల వ్యవసాయ విద్యుత్ సర్వీసులున్నాయి. అత్యంత అధునాతన, నాణ్యమైన పంపుసెట్లు ఏర్పాటు చేయడంతో విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గినట్టు సంస్థ అధికారుల సర్వేలో తేలింది. ఒకవైపు నాణ్యమైన వ్యవసాయ పంపుసెట్లను రైతులు కోరుకుంటుండగా, గత ఏడాది కాలంగా ఆదరణ పెరుగుతున్న సోలార్ వ్యవసాయ పంపుసెట్ల పట్ల మరింత ఆసక్తి చూపుతున్నారు. వీటి కోసం ఐదు జిల్లాలకు చెందిన రైతుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తున్నాయి. ప్రయోగాత్మకంగా ఈ ఏడాది వెయ్యి సోలార్ పంపుసెట్లను సంస్థ మంజూరు చేయగలిగింది. దరఖాస్తులు మాత్రం మూడు వేలకు పైగానే వచ్చాయి. రైతుల నుంచి ఆదరణ పెరగడంతో మరో వెయ్యి సోలార్ పంపుసెట్లను మంజూరు చేసేందుకు సంస్థ రంగం సిద్ధం చేసింది. సోలార్ వ్యవసాయ పంపుసెట్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నాణ్యమైన, కాలుష్యరహిత విద్యుత్‌ను రైతులు పొందగలుగుతున్నారు. అలాగే సంస్థకు విద్యుత్ లైన్లను నిర్మించాల్సిన భారం కూడా తప్పింది.