బిజినెస్

ఏకమవుతున్నాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: అనీల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), ఎయిర్‌సెల్ ఏకమవుతున్నాయి. ఎయిర్‌సెల్‌తో తమ వైర్‌లెస్ టెలికామ్ వ్యాపారాన్ని విలీనం చేసేందుకు ఆర్‌కామ్ బుధవారం అంగీకరించింది. దీంతో 65,000 కోట్ల రూపాయలకుపైగా ఆస్తులతో దేశీయ టెలికామ్ రంగంలో నాలుగో అతిపెద్ద సంస్థగా ఆర్‌కామ్, ఎయిర్‌సెల్ కలయికతో ఏర్పడే సంస్థ ఆవిర్భవించనుంది. భారతీయ టెలికామ్ రంగంలో అతిపెద్ద విలీనంగా చెప్పుకుంటున్న ఈ లావాదేవీ కోసం ఆర్‌కామ్, ఎయిర్‌సెల్‌లో మెజారిటీ వాటాదారైన మలేషియాకు చెందిన మ్యాక్సిస్ కమ్యూనికేషన్స్ బెర్హాద్ (ఎమ్‌సిబి) డెఫినిటివ్ డాక్యుమెంట్లపై సంతకాలు చేస్తున్నట్లు ప్రకటించాయి. విలీనం తర్వాత ఏర్పడే నూతన సంస్థలో ఆర్‌కామ్, ఎయిర్‌సెల్‌కు సమానంగా 50 శాతం చొప్పున వాటాలుంటాయి. ‘ఆర్‌కామ్-ఎయిర్‌సెల్ విలీనంతో ఏర్పడే సంస్థ దేశీయ టెలికామ్ రంగంలో కస్టమర్ల పరంగానైనా, ఆదాయపరంగానైనా అతిపెద్ద నాలుగు సంస్థల్లో ఒకటిగా ఉంటుంది. భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్ సరసన నిలుస్తుంది. దేశంలోని 12 ప్రధాన టెలికామ్ సర్కిళ్లలోనైతే ఆదాయపరంగా తొలి మూడు భారీ సంస్థల్లో ఒకటిగా ఉంటుంది.’ అని ఓ సంయుక్త ప్రకటనలో ఇరు సంస్థలు తెలియజేశాయి. కాగా, ప్రస్తుతం ఆర్‌కామ్ 110 మిలియన్ల కస్టమర్లతో దేశంలోని నాలుగో అతిపెద్ద టెలికామ్ ఆపరేటర్‌గా ఉంది. ఎయిర్‌సెల్ 84 మిలియన్ల కస్టమర్లతో ఐదో స్థానంలో ఉండగా, మార్కెట్‌లో వీటి వాటా వరుసగా 9.8 శాతం, 8.5 శాతంగా ఉంది. ఇంతకుముందే ఆర్‌కామ్‌లో విలీనమైన సిస్టెమాకు 0.7 శాతం వాటా ఉండగా, నూతన సంస్థలో దీనికి 10 శాతం వాటా ఉంటుంది. మరోవైపు కొత్త సంస్థకున్న 28,000 కోట్ల రూపాయల రుణభారాన్ని ఆర్‌కామ్, ఎయిర్‌సెల్ 14,000 కోట్ల రూపాయల చొప్పున పంచుకోనున్నాయి. 6,000 కోట్ల రూపాయల స్పెక్ట్రమ్ చెల్లింపులు అదనం. ఇక కొత్త సంస్థకు 65,000 కోట్ల రూపాయలకుపైగా ఆస్తులుండగా, 35,000 కోట్ల రూపాయల వరకు నగదు నిల్వలుంటాయి. అంతేగాక టెలికామ్ రంగంలో మరే సంస్థకు లేనివిధంగా 19.3 శాతం స్పెక్ట్రమ్ వాటా దీని సొంతం. 800, 900, 1800, 2100 మెగాహెట్జ్ శ్రేణిలో స్పెక్ట్రమ్ వాటాలున్నాయి. ఇది దేశవ్యాప్తంగా 2జి, 3జి, 4జి సేవలకు ఉపయోగపడుతుంది. కాగా, ఈ విలీనంతో ఆర్‌కామ్ రుణభారం 20,000 కోట్ల రూపాయలు తగ్గనుండగా, ఎయిర్‌సెల్ రుణభారం 4,000 కోట్ల రూపాయలు తగ్గనుంది.