బిజినెస్

‘జన్ ధన్’ వివాదంపై ప్రభుత్వం దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: జీరో బ్యాలెన్స్ ఖాతాల సంఖ్యను తక్కువగా చూపేందుకు కొంత మంది బ్యాంకర్లు జన్ ధన్ బ్యాంకు ఖాతాల్లో ఒక్కో రూపాయి చొప్పున డిపాజిట్ చేస్తుండటంపై వివాదం చెలరేగుతుంటంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల అధినేతలతో నిర్వహించనున్న త్రైమాసిక సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల పనితీరుపై ఈ సమావేశంలో జైట్లీ సమీక్ష జరుపతారని అధికార వర్గాలు వెల్లడించాయి. దీనితో పాటు రుణ వితరణ పెరుగుదల, మొండి బకాయిల స్థితిగతులపై ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందని, అలాగే మొండి బకాయిలను వసూలు చేసేందుకు బ్యాంకులతో పాటు చట్టపరంగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు కూడా ఈ సమావేశ అజెండాలో భాగంగా ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. జీరో బ్యాలెన్స్ ఖాతాలను తక్కువగా చూపేందుకు కొన్ని బ్యాంకులు ఆయా ఖాతాల్లో రూపాయి లేదా అంతకంటే కొంచెం ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేసిన ఉదంతాలను వెలుగులోకి తీసుకొస్తూ గత కొంత కాలం నుంచి వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. వాస్తవానికి ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పిఎంజెడివై) ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదని, అయినప్పటికీ జీరో బ్యాలెన్స్ ఖాతాల సంఖ్యను తక్కువగా చూపేందుకు కొంత మంది బ్యాంకర్లు జన్ ధన్ ఖాతాల్లో స్వల్ప మొత్తాలను డిపాజిట్ చేసినట్లు వార్తలు వెలువడినందున ఇందులో వాస్తవమెంతో తెలుసుకుని ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకం గురించి కింది స్థాయి బ్యాంకు శాఖల స్థాయిలో అవగాహనా లోపమేదైనా తలెత్తిందేమో పరిశీలిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ గురువారం రాత్రి వివరణ ఇచ్చింది.