బిజినెస్

కరెన్సీ బలాన్ని నిర్ణయించేది మార్కెట్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: రూపాయి విలువను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలు వెలువడటంతో గురువారం ఉదయం దేశీయ కరెన్సీ విలువ అకస్మాత్తుగా పతనమైంది. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు రంగంలోకి దిగి, రూపాయి విలువను తగ్గించాలన్న ఆలోచనలేమీ లేవని, ఇకముందు కూడా దీని విలువను మార్కెట్టే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. గత 20 నెలల్లో ఒకే ఒక్క నెల మినహా మిగిలిన అన్ని నెలల్లో ఎగుమతులు పతనమవడంతో రూపాయి విలువను తగ్గించేందుకు గల అవకాశాలపై కేంద్ర ఆర్థిక శాఖతో వాణిజ్య మంత్రిత్వ శాఖ చర్చించే అవకాశం ఉందన్న వార్తలు వెలువడటంతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ అంశాన్ని వాణిజ్య శాఖ ముందుకు తీసుకొచ్చిందని, అయితే రూపాయి విలువ తగ్గించాలన్న ప్రతిపాదన ఏదీ రాలేదని ఆర్థిక శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇదేవిధంగా స్పందించారు. రూపాయి విలువ తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని కొంతమంది ఎగుమతిదారులు వాణిజ్య శాఖకు విజ్ఞప్తి చేశారని, అయితే దీని గురించి తమ వైపు నుంచి చర్చించాల్సింది ఏమీ లేదని ఆమె అన్నారు. అంతేకాకుండా రూపాయి విలువ తగ్గించే విషయమై ప్రభుత్వం చర్చిస్తోందని తాను ఎవరితోనూ చెప్పలేదని ఆమె తెలిపారు. ‘రూపాయితో పాటు ఏ కరెన్సీ విలువ తగ్గింపు గురించి నేను ఏ వార్తా సంస్థ ప్రతినిధితోనూ సంభాషించలేదు. ఈ విషయంలో నన్ను ఉటంకిస్తూ వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవే’ అని నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు.
ఇదిలావుంటే, రూపాయి విలువను నిర్దేశించేది ప్రభుత్వం కాదని, దీని రేటును నిర్ణయించేది మార్కెట్టేనని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొంటూ, ఈ విధానాన్ని మార్చాలన్న ఆలోచన ఏదీ లేదని తేల్చిచెప్పారు. రూపాయి విలువను తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన విలేఖరులకు స్పష్టం చేశారు.