బిజినెస్

రూ. 500 కోట్లతో గండికోట అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, డిసెంబర్ 25: కడప జిల్లాలోని గండికోటను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. అటవీ, పర్యాటక, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో ఈ మేరకు చర్చించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ద్వారా ప్రత్యేక నిధుల కోసం ఒక పక్క ప్రయత్నాలు చేస్తూనే, మరోపక్క అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక రంగంలో అనుభవం కలిగి పెట్టుబడులు పెట్టటానికి ఆసక్తి చూపేవారిని, అంతర్జాతీయస్థాయి పర్యాటక నిపుణులను రప్పించాలని నిర్ణయించింది. తొలుత గండికోటకు ప్రాథమికంగా వివిధ సౌకర్యాలు, హంగులు కల్పించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఇటీవల జమ్మలమడుగు నుంచి గండికోటకు విశాలమైన రోడ్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 18 కోట్లతో పనులు చేపట్టేందుకు సిఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రపంచంలోనే పర్యాటక రంగంలో చైనా మొదటిస్థానంలోనూ, రెండవ స్థానంలో అమెరికా దేశాలు ఉండగా, 3వ స్థానంలో గండికోటను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారు. శతాబ్దాల క్రితం ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన వజ్రాలు, వైడూర్యాల వ్యాపారం గండికోట నుంచే కొనసాగినట్లు ఆధారాలున్నాయి. 1651లో ట్రావెల్ ఇన్ ఇండియా ఫ్రెంచి బృందం, 1799లో ఈస్ట్ ఇండియన్ కంపెనీ వ్యాపార నిమిత్తం ఇక్కడకు వచ్చారు. నిజాం పాలనలో హైదర్ అల్లీటిప్ 1651లో ఇక్కడ రాజు నుంచి సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. అలాంటి గండికోటను సుమారు 500 కోట్ల రూపాయలతో తీర్చిదిద్ది దేశ,విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేస్తానని సిఎం ప్రకటించారు. రాబోయే అయిదేళ్లలో గండికోటను తీర్చిదిద్దడానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు జిల్లా అధికారులు ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు. ఈ నెల 22న రాష్ట్ర ప్రభుత్వం, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, టూరిజం, ఫారెస్టు అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశమై ప్రణాళికల తయారీపై చర్చించారు. పురాతన కట్టడాలు తొలగించకుండా వాటికి తుది మెరుగులు దిద్ది వందలాది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గండికోటను సుందరంగా తయారుచేయాలని నిర్ణయించారు. అక్కడక్కడ శిథిలావస్థలో ఉన్న కట్టడాలకు మరమ్మతులు చేసి, ముఖద్వారానికి కొత్త హంగులు కల్పించాలని కూడా నిర్ణయించారు. చారిత్రాత్మక కట్టడాలైన మాధవరాయస్వామి, రఘునాధస్వామి ఆలయాలను, ధాన్యాగారం, జామియా మసీదు, పురాతన కారాగారాన్ని పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా గండికోట ఎగువన గండికోట రిజర్వాయర్, దిగువన మైలవరం రిజర్వాయర్లు ఉండగా, గండికోటను ఆనుకునే సహజ సిద్ధమైన లోయ, ఆరు కిలోమీటర్ల గాడ్జి ఉండటంతో ఈ ప్రాంతం ప్రకృతి రమణీయంగా ఉంటుంది. గాడ్జి నుంచి గండికోట రహదారి మార్గాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. పర్యాటకశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి నీరజ్‌కుమార్ ప్రసాద్, పర్యాటక కమిషనర్ ఖజారియా, పర్యాటక రంగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలసుబ్రమణ్యం రెడ్డిలు సంబంధిత శాఖ ఉన్నతాధికారులను జిల్లాకు పంపి ఇప్పటికే గండికోటను పరిశీలించారు. ముఖ్యమంత్రి కూడా ఇటీవలే కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలిసి గండికోట ప్రాచుర్యాన్ని వివరించడంతో కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన దరిమిలా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు జిల్లా అధికారులతో చర్చించి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కెవి రమణ ఆదేశంతో జిల్లాపర్యాటక అధికారి జి గోపాల్ వివిధ శాఖల అధికారులతో మాట్లాడి ప్రణాళిక తయారీకి రంగం సిద్ధం చేస్తున్నారు.

గండికోటను ఆనుకుని సహజసిద్ధంగా ఏర్పడిన పెన్నా గాడ్జి