బిజినెస్

22న మార్కెట్లోకి హెచ్‌పిఎల్ ఐపిఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 17:ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కంపెనీ హెచ్‌పిఎల్ ఎలక్ట్రిక్ అండ్ పవర్ సంస్థ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) ద్వారా 361 కోట్ల రూపాయలను సమకూర్చుకోవాలని అనుకుంటోంది. వ్యాపార పెట్టుబడి అవసారలు, అప్పుల్లో కొంత భాగాన్ని తీర్చడం కోసం ఈ నిధులను ఉపయోగించుకోవాలని ఆ కంపెనీ భావిస్తోంది. ప్రతి షేరు రూ. 175-200 ప్రైస్ బ్యాండ్‌తో ఉండే ఈ ఇష్యూ ఈ నెల 22న ప్రారంభమయి 26వ తేదీతో ముగుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రోజువారీ వ్యాపార పెట్టుబడి అవసరాల కోసం, అప్పులు తిరిగి చెల్లించడానికి ఐపిఓ ద్వారా వచ్చిన నిధులను ఉపయోగించుకోవాలని తాము అనుకుంటున్నామని కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సేథ్ చెప్పారు. మీటరింగ్ సొల్యూషన్లు, స్విచ్ గేర్లు, లైటింగ్ పరికరాలు, వైర్లు, కేబుల్స్ తయారు చేసే ఈ కంపెనీకి రూ. 560 కోట్ల అప్పులున్నాయి. ఐపిఓ ద్వారా వచ్చే నిధుల్లో 130 కోట్ల రూపాయలను అప్పుల్లో కొంత భాగం చెల్లించడానికి, మిగతా 189 కోట్లను వ్యాపార పెట్టుబడి అవసరాలకోసం ఉపయోగించుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. బ్రాండ్ ఇమేజిని పెంచుకోవడానికి, దేశవ్యాప్తంగా తన ఉనికిని చాటుకోవడానికి కంపెనీ ప్రాధాన్యత ఇస్తుందని కూడా ఆయన చెప్పారు. ఈ కంపెనీ ఈక్విటీ షేర్లు బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇ రెండింటిలోను లిస్టింగ్ అవుతాయి. అనుబంధ సంస్థ అయిన హిమాచల్ ఎనర్జీ ఆదాయంతో కలుపుకొని 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ మొత్తం రాబడి రూ. 1350 కోట్లుగా ఉంది. కంపెనీకి హర్యానాలో అయిదు చోట్ల హిమాచల్ ప్రదేశ్‌లోని జబ్లిలో ఒక యూనిట్ ఉన్నాయి.

వివరాలు వెల్లడిస్తున్న హెచ్‌పిఎల్ సిఎండి లలిత్ సేథ్,
జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సేథ్