బిజినెస్

పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రచారకర్తగా కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంకు (పిఎన్‌బి) తమ ప్రచారకర్త (బ్రాండ్ అంబాసిడర్)గా భారత టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని నియమించుకుంది. మొండి బకాయిలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ఈ బ్యాంకు తన ప్రతిష్టను పెంచుకునేందుకు ఈ చర్య చేపట్టింది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, పంజాబ్ నేషనల్ బ్యాంకును ‘అందరి బ్యాంకు’గా అభివర్ణించాడు. 16 ఏళ్ల వయసు నుంచే తాను ఈ బ్యాంకు ఖాతాదారుడిగా కొనసాగుతున్నట్లు కోహ్లీ చెప్పాడు. దేశ, విదేశాల్లో కోట్లాది మంది అభిమానుల మనసు చూరగొన్న కోహ్లీ అకుంఠిత దీక్ష, పట్టుదలతో ముందుకు సాగుతూ విజయాన్ని అలవాటుగా మార్చుకున్నాడని, అందుకే ఆయనను తమ ప్రచారకర్తగా నియమించుకున్నామని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
1895లో ఏర్పడిన పంజాబ్ నేషనల్ బ్యాంకు దేశంలో లక్షలాది మంది ఖాతాదారులకు ఎనలేని సేవలను అందిస్తూ ప్రజల బ్యాంకుగా ఖ్యాతి పొందడంతో పాటు దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. అయితే మొండి బకాయిలు గణనీయంగా పెరగడంతో జూన్ నెలతో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో ఈ బ్యాంకు లాభం 58 శాతం తగ్గి 306 కోట్ల రూపాయలకు పడిపోయింది. గత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో రూ.1,291 కోట్లుగా ఉన్న ఈ బ్యాంకు నిరర్థక ఆస్తుసు ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దాదాపు మూడు రెట్లు పెరిగి రూ.3,620 కోట్లకు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో ఏడాది క్రితం 12.9 శాతంగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు ఈ ఏడాది జూన్ నెల ముగిసే నాటికి 13.75 శాతానికి పెరగగా, నికర నిరర్థక ఆస్తులు 8.61 శాతం నుంచి 9.16 శాతానికి పెరిగాయి.