బిజినెస్

వెల్లువలా రెక్టిఫైడ్ స్పిరిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 25: ఉత్తర కోస్తాలో కల్తీ మద్యం వరదలై పారుతోంది. ఇటీవల విజయవాడ నగరం కేంద్రంగా కల్తీమద్యం కాటుకు ఐదుగురు బలికాగా, మరికొంత మంది అమాయకులు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒడిశా రాష్ట్రం నుంచి వెల్లువెత్తుతున్న రెక్టిఫైడ్ స్పిరిట్ (ఆర్‌ఎస్)తో ఇక్కడ మద్యం వ్యాపారులు చీప్ లిక్కర్‌ను తయారు చేస్తూ అమాయకుల ప్రాణాలు హరిస్తున్నారు. అధిక లాభాలకు ఆశపడుతున్న మద్యం వ్యాపారుల అత్యాశ అమాయకుల ప్రాణాలను బలికొంటోంది. తాజాగా విశాఖ జిల్లా అనకాపల్లి డివిజన్ కేంద్రంలో పట్టుబడిన నకిలీ మద్యం అంశం సంచలనం సృష్టించింది. ఒడిశా రాష్ట్రం జైపూర్ నుంచి అక్రమంగా రవాణా అవుతున్న నకిలీ మద్యం లారీని ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ అధికారులు గురువారం పట్టుకున్నారు. ఆరా తీయగా ఒడిశా రాష్ట్రం నుంచి నకిలీ మద్యం రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. దీనిపై మరింత లోతుగా విచారణ చేసిన ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులకు ఆశ్చర్యకరమైన సమాచారం లభించింది. దక్షిణ ఒడిశాలో దాదాపు 25 వరకూ మద్యం తయారీ డిస్టిలరీలు ఉన్నాయి. మొలాసిస్ నుంచి ఆర్‌ఎస్‌ను తయారు చేసి విక్రయించడమే వీరి వ్యాపారం. సరిహద్దు రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున మద్యం వ్యాపారం సాగడం వీరికి అనుకూలంగా పరిణమించింది. అయితే ఇక్కడ లైసెన్స్డ్ మద్యం దుకాణాలకు ఎపి బేవరేజెస్ కార్పొరేషన్ (ఎపిబిసిఎల్) ద్వారానే మద్యం సరఫరా అవుతుంది. డిస్టిలరీల నుంచి ఎపిబిసిఎల్ కొనుగోలు చేసి, మద్యం దుకాణాలకు విక్రయిస్తుంది. దీంతో పెద్దగా లాభాలు రాకపోవడంతో మద్యం వ్యాపారులు అక్రమాలకు తెరతీస్తున్నారు. పక్క రాష్ట్రంలో అతి తక్కువ ధరకు లభ్యమయ్యే ఆర్‌ఎస్‌ను కొనుగోలు చేసి, చీప్ లిక్కర్‌గా మార్చి విక్రయిస్తున్నారు. ఒడిశా నుంచి వస్తున్న ఆర్‌ఎస్ 750 మిల్లీలీటర్లు రూ. 70 నుంచి 100కు కొనుగోలు చేస్తున్న మద్యం వ్యాపారులు.. దీన్ని మద్యం సీసాల్లో నింపి రూ. 350 నుంచి 450కి విక్రయిస్తున్నారు. అన్ని ఖర్చులు పోను ఒక్కో మద్యం సీసా పైనా 120 శాతం లాభాలు వస్తాయని ఎక్సైజ్ అధికారులు లెక్కకట్టారంటే ఈ వ్యాపారం ఏ స్థాయిలో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఒడిశా నుంచి వస్తున్న ఆర్‌ఎస్ ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల వరకూ రవాణా అవుతున్నట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. కొన్ని రకాల మద్యం బ్రాండ్లకు బోలో కేప్స్ (ప్లాస్టిక్ మూతలు) ఉన్నప్పటికీ కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం నుంచి వీటిని సేకరించి ఒడిశా నుంచి తెచ్చిన ఆర్‌ఎస్‌తో నింపి విక్రయిస్తున్నట్టు కనిపెట్టారు. కాగా, నకిలీ మద్యం తయారీ, విక్రయాల్లో అన్ని రాజకీయ పార్టీల ప్రమేయం ఉన్నట్టు యంత్రాంగం భావిస్తోంది. దీనిపై దృష్టి సారించిన ఎక్సైజ్ టాస్క్ఫోర్సు విభాగం చెక్‌పోస్టుల వద్ద మరింత నిఘా పెంచడం ద్వారా నకిలీ మద్యం రవాణాను అరికట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.