బిజినెస్

జిఎస్‌టి అమలు కోసం పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: దేశ స్థితి గతులను వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) సంస్కరణ సమూలంగా మార్చేస్తుందని కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి పికె.సిన్హా శనివారం పేర్కొంటూ, ఈ పరోక్ష పన్నును వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ‘ఓవర్ టైమ్’ పనిచేస్తూ శరవేగంగా పరుగులు తీస్తోందని తెలిపారు. దేశ వ్యాప్తంగా జిఎస్‌టిని ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన 2016 రాజ్యాంగ (122వ సవరణ) బిల్లుకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 8వ తేదీన ఆమోదముద్ర వేయడంతో 2016 రాజ్యాంగ (101వ సవరణ) చట్టంగా ప్రభుత్వం దీనిని నోటిఫై చేసిన విషయం విదితమే. అయితే దేశ స్థితి గతులను సమూలంగా మార్చేయడమే కాకుండా సవాలు కూడా నిలిచే వస్తు, సేవల పన్నును 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఓవర్ టైమ్ పనిచేస్తోందని శనివారం న్యూఢిల్లీలో పిహెచ్‌డిసిసిఐ ఆధ్వర్యాన జరిగిన ప్రధాన కార్యదర్శుల సమావేశంలో పికె.సిన్హా తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సర ఆరంభం (ఏప్రిల్ 1వ తేదీ) నుంచి జిఎస్‌టిని సజావుగా అమలులోకి తీసుకొచ్చి సంవత్సరం మధ్యలో ఎటువంటి సవరణలు చేపట్టాల్సిన అవసరం లేకుండా చూడాలని ప్రభుత్వం ఆశిస్తోంది. వస్తు, సేవల పన్నుతో పాటు ప్రజలకు హామీ ఇచ్చిన ఇతర కీలక సంస్కరణలను అమలు చేయాలని ప్రభుత్వం నిబద్ధతతో ఉందని సిన్హా చెప్పారు. ‘దేశంలో నిశబ్ధ విప్లవం చోటుచేసుకుంటోంది. ఎన్నో సమస్యలు దేశాన్ని ఇబ్బంది పెడుతున్నప్పటికీ అన్ని రంగాల ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను భారత్ చేరుకుంటుంది’ అని ఆయన సిన్హా పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా వౌలిక వసతుల రంగంలో రోడ్లు, పౌర విమానయాన, ఇంధన, సాంప్రదాయ, సాంప్రదాయేతర విద్యుత్, పెట్రోలియం, రైల్వే విభాగాలు ఇప్పటికే తమ పనితీరును మెరుగుపర్చుకున్నాయని, ముఖ్యంగా పౌర విమానయాన రంగం 20 శాతం వృద్ధితో రైల్వేలకు తీవ్రమైన సవాళ్లను విసురుతోందని సిన్హా తెలిపారు.
నీతి ఆయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్ మాట్లాడుతూ, వ్యాపారాన్ని సులభతరం చేయడంలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ తత్వాత్వాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని అనేక రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు పరస్పరం పోటీ పడుతున్నాయని, ఇది ఎంతో శుభసూచికమని ఆయన అన్నారు. సృజనాత్మకతపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం దేశాన్ని వ్యాపారానికి అనువైన ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోందని అమితాబ్ కాంత్ చెప్పారు.
chitram...
కేంద్ర మంత్రివర్గ
కార్యదర్శి పికె.సిన్హా