బిజినెస్

విద్యుత్ అంతరాయాలకు క్షణాల్లో చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 19: అనేక రకాల సాంకేతిక సమస్యలతో నిలిచిపోయే విద్యుత్ సరఫరాను క్షణాల్లో మెరుగుపర్చే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆన్‌లైన్ ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ అందుబాటులోకి వస్తోంది. దీనివల్ల విద్యుత్ అంతరాయం విషయం క్షేత్రస్థాయి అధికారులకు క్షణాల్లో తెలిసిపోతుంది. దీనిపై అందిన ఫిర్యాదుల పట్ల కేవలం 30 నిమిషాల్లో స్పందించకపోతే ఆ పైస్థాయి అధికారులను అప్రమత్తం చేస్తుంది. ఈ విధంగా అంతరాయాల గురించిన సమాచారం సంస్థలో అన్ని కేడర్లలో అధికారులతోపాటు ప్రజలకు సులభంగా వెళ్ళిపోతుంది. జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన సేవలను అత్యంత వేగవంతంగా అందించే లక్ష్యంతో ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఇపిడిసిఎల్) తొలిసారి ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. దేశంలో 48 డిస్ట్రిబ్యూషన్ కంపెనీలుండగా, ఎక్కడా ఇటువంటి విధానం అమల్లో లేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తున్న ఇపిడిసిఎల్ ఆంధ్ర రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఆన్‌లైన్ ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్‌ను ఈ నెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిలో ప్రారంభిస్తారు. ఏపిలోని 13 జిల్లాల్లో ఐదు జిల్లాలు ఇపిడిసిఎల్ పరిధిలో ఉన్నాయ. వీటితో పాటు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఎస్‌పిడిసిఎల్) పరిధిలో ఉన్న మరో ఎనిమిది జిల్లాల్లో మొత్తం 2,800 ఫీడర్లు ఉన్నాయి. ఇందులో ఏ ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా ఆన్‌లైన్ ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్, లేదంటే డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్‌కు సమాచారంతో కూడిన ఫిర్యాదు అందుతుంది. ఈ ఫిర్యాదు పరిష్కారంలో జాప్యం జరిగితే ఆ సమాచారం సూపరింటెండెంట్ ఇంజనీర్‌కు ఆ తర్వాత ఉన్నత స్థాయి అధికారులకు చేరుతుంది.

ఓడరేవు, పారిశ్రామిక కారిడార్‌కు
భూసమీకరణ నోటిఫికేషన్

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, సెప్టెంబర్ 19: బందరు ఓడరేవుతో పాటు దానికి సమీపంలోనే పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసేందుకు మొత్తం 33,338 ఎకరాల భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం సోమవారం రాత్రి భూసమీకరణ నోటిఫికేషన్ జారీచేసింది. రాజధాని తరహాలోనే భూములు కోల్పోయే రైతులకు ప్రత్యేక ప్యాకేజీ కింద నివాస, వాణిజ్య స్థలాలను ఆయా కేటగిరీల వారీగా లాటరీ పద్ధతిలో కేటాయించనున్నారు. మొత్తం 21 గ్రామాల్లో 14,602 ఎకరాలు పట్టా భూమి, 8,958 ఎకరాల అసైన్డ్ భూములు, 9,778 ఎకరాల ప్రభుత్వ భూమి వెరశి 33,338 ఎకరాలు సమీకరించనున్నారు. ఇందులో ఓడరేవు కోసం 5,055 ఎకరాలు, పారిశ్రామిక కారిడార్ కోసం 28,283 ఎకరాలు కేటాయిస్తారు. భూసమీకరణ నోటిఫికేషన్‌తో దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న ఓడరేవు నిర్మాణానికి మార్గం సుగమం అయినట్లయింది. పట్టా భూములు కోల్పోయే రైతులకు నివాస ప్రాంతాల్లో వెయ్యి గజాలు, వాణిజ్య ప్రాంతాల్లో 250 గజాల చొప్పున కేటాయిస్తారు. అసైన్డ్ భూముల్లో నివాస ప్రాంతంలో వెయ్యి గజాలు, వాణిజ్య ప్రాంతాల్లో 200 గజాలు కేటాయిస్తారు. 1954 తరువాత జరిగిన అసైన్‌మెంట్ భూముల భూబదలాయింపు చట్టం పరిధిలోకి రానివారికి 800, 100 గజాల చొప్పున, అభ్యంతరమైన ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు కేవలం నివాస ప్రాంతంలో 240 గజాలు కేటాయించన్నుట్లు నోటిఫికేషన్‌లో ప్రభుత్వం వివరించింది.