బిజినెస్

అచ్చం ‘కింగ్‌ఫిషర్’ మాదిరిగానే.. ఎగిరిపోయాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 19: దేశంలో బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి విదేశానికి పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై బాంబే హైకోర్టు సోమవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తన సంస్థకు ఎంతో తగ్గట్టుగా ‘కింగ్‌ఫిషర్’ అనే పక్షి పేరు పెట్టుకున్న విజయ్ మాల్యా సరిహద్దులను ఏమాత్రం ఖాతరు చేయకుండా అచ్చం ఆ పక్షి మాదిరిగానే దేశం నుంచి ఎగిరిపోయాడని న్యాయస్థానం పేర్కొంది. సేవా పన్ను విభాగం దాఖలు చేసిన రెండు పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ ఎస్‌సి.్ధర్మాధికారి, జస్టిస్ బిపి కొలాబావాలాతో కూడిన బాంబే హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘విజయ్ మాల్యా మాదిరిగా చరిత్రలో ఎవరూ తమ సంస్థలకు ఇంతకంటే తగిన పేర్లు పెట్టుకోలేదు. మాల్యా తన సంస్థకు కింగ్‌ఫిషర్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నారో ఎవరికైనా తెలుసా? ఎందుకంటే ‘కింగ్‌ఫిషర్’ అనేది సరిహద్దులతో నిమిత్తం లేకుండా ఎగిరిపోయే పక్షి గనుక. ఎల్లలంటే ఏమిటో తెలియని ఆ పక్షిని ఎవరూ ఆపలేరు. అందుకే తన సంస్థకు కింగ్‌ఫిషర్ అని పేరు పెట్టుకున్న మాల్యా, ఆ పక్షి మాదిరిగానే దేశం నుంచి ఎగిరిపోయారు. ఈ విషయంలో మాల్యాను కూడా ఎవరూ ఆపలేకపోయారు’ అని జస్టిస్ ధర్మాధికారి వ్యాఖ్యానించారు. 2014లో రుణాల రికవరీ ట్రిబ్యునల్ జారీ చేసిన ఒక ఉత్తర్వును సవాలుచేస్తూ సేవా పన్ను విభాగం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం ఈ సందర్భంగా విచారణకు స్వీకరించింది. కింగ్‌ఫిషర్ విమానయాన సంస్థ 2011 ఏప్రిల్ నుంచి 2012 సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రయాణికులకు అమ్మిన టిక్కెట్లకు సంబంధించి విజయ్ మాల్యా 32.68 కోట్ల రూపాయల సేవా పన్ను చెల్లించాల్సి ఉందని, మాల్యా తమకు మొత్తం 532 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందని సేవా పన్ను విభాగం ఈ పిటిషన్‌లో పేర్కొంది. అయితే ఈ పిటిషన్‌పై తదుపరి దశలో విచారణ జరుపుతామని ధర్మాసనం వాయిదా వేసింది.
కాగా, విజయ్ మాల్యాకు చెందిన వ్యక్తిగత జెట్ విమానాన్ని అమ్మేందుకు గతంలో నిర్వహించిన వేలంలో అత్యధిక మొత్తానికి బిడ్ దాఖలు చేసిన బిడ్డర్ ఆ విమాన మొత్తం ధరలో 80 శాతానికి మాత్రమే బిడ్‌ను దాఖలు చేశాడని, కనుక ఆ వేలాన్ని రీకాల్ చేయాలని కోరుతూ బాంబే హైకోర్టులో సేవా పన్ను విభాగం మరో పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 26వ తేదీన విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. 25 మంది ప్రయాణికులతో పాటు మరో ఆరుగురు సిబ్బందిని తీసుకెళ్లే సామర్ధ్యమున్న మాల్యా జెట్ ఎయిర్‌బస్ -319 విమానాన్ని సేవా పన్ను విభాగం ఇదివరకే జప్తు చేసిన విషయం తెలిసిందే. దీనిని వేలం వేసేందుకు సేవా పన్ను విభాగం ఈ ఏడాది మే నెలలో నోటీసు జారీ చేసింది. ఈ విమానంలో కాన్ఫరెన్స్ హాళ్లు, మీటింగ్ రూములు, బెడ్‌రూము, ఎటాచ్డ్ బాత్‌రూము వంటి ఎంతో విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయని సేవా పన్ను విభాగం ఆ నోటీసులో పేర్కొంది.