బిజినెస్

సింగరేణికి విదేశీ బొగ్గు సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, సెప్టెంబర్ 21: వార్షిక ఉత్పత్తిలో వెనుకబడిన సింగరేణికి విదేశీబొగ్గు అశనిపాతంగా మారి సంస్థ మనుగడకే ప్రమాదంగా పరిణమించింది. అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తే సంస్థ తిరోగమనానికి సవాలక్ష కారణాలు కనిపిస్తున్నాయి. 2016-2017 ఆర్థిక సంవత్సరంలో 66.06 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో గడచిన ఆరు మాసాల లక్ష్యాన్ని సాధించలేకపోగా ఇప్పటివరకు గత ఏడాదిలో చేసిన ఉత్పత్తికంటే వెనుకబడి ఉండడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 20 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడి ఉండగా గత ఆర్థిక సంవత్సరం కంటే 6.5లక్షల టన్నులు వెనుకబడి ఉండడం ఆందోళన కలిగించే విషయం. సంస్థలో ఉన్న 29 భూగర్భగనులలో కేవలం ఒక్క గని మాత్రమే లాభాలలో నడుస్తుండగా మిగిలినవన్నీ వాటిలో పనిచేసే కార్మికుల వేతనాలను చెల్లించే పరిస్థితిలో లేకపోవడం సంస్థకు శాపంగా మారింది. అంతేకాకుండా భూగర్భగనులలో టన్నుబొగ్గు ఉత్పత్తికి రూ 1,653లను ఎదురు పెట్టుబడి పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. దీనికి తోడు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా విదేశాల నుండి సింగరేణి కంటే నాణ్యమైన బొగ్గు తక్కువ ధరకు లభిస్తుండడంతో సింగరేణి సంస్థ మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా బొగ్గు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడంతోపాటు నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయాల్సిన పరిస్ధితిలోకి సింగరేణి నెట్టిబడింది. ఆంతేకాకుండా గత రెండు మాసాలుగా కురుస్తున్న భారీ వర్షాలకు బొగ్గుఉత్పత్తిలో కీలకపాత్ర పోషించే ఓపెన్‌కాస్టులలో ఉత్పత్తి మందగించడం సంస్ధపై తీవ్రప్రభావాన్ని చూపుతోంది. ప్రస్తుత పరిస్ధితులలో ధర్మల్ పవర్ స్టేషన్లు విదేశీబొగ్గుపై మక్కువ చూపుతుండడంతో సింగరేణి పరిస్థితి దయనీయంగా తయారైంది. గతంలో కావలసిన దానికంటే ఎక్కువ సరుకును కోరితే 60 శాతం రేటును ఎక్కువ చెల్లించాల్సి వచ్చేది. కానీ గతం కంటే తీసుకునే బొగ్గుకంటే తక్కువ బొగ్గును కొనుగోలు చేయడం వల్ల సింగరేణి నష్టాల ఊబిలోకి కూరుకుపోతోంది. హైడల్, సోలార్ విద్యుత్ వాడకం కూడా పెరగడంతో ధర్మల్‌పవర్ వాడకం తగ్గుతోంది. దీంతో ధర్మల్‌పవర్ స్టేషన్లు గతంలో మాదిరిగా ఎక్కువ మోతాదులో బొగ్గు నిల్వలను ఉంచుకోవడం లేదు. కర్ణుని మరణానికి వంద కారణాలన్నట్లు సింగరేణి తిరోగమనానికి కూడా పలుకారణాలు కనిపిస్తున్నాయి. యాజమాన్యం మాత్రం కాయకల్ప చికిత్సగా ఈ నెల 30వ తేదీ వరకు అన్ని గనులు, డిపార్టుమెంట్ల వద్ద మల్టీ డిపార్టుమెంటల్ కమిటీల నేతృత్వంలో సంస్థ పరిస్థితిని వివరించి ఉత్పత్తి లక్ష్యసాధనకు కార్యోన్ముఖులను చేసేందుకు సమావేశాలను నిర్వహిస్తోంది.