బిజినెస్

మార్కెట్లకు జపాన్ బ్యాంక్ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 21: అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ధోరణులు కొనసాగించినప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఒడిదుడుకుల మధ్యనే సాగాయి. ప్రారంభంలో లాభాలతో మొదలైన మార్కెట్లు ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ జపాన్ పరపతి విధానం సమీక్ష తర్వాత మధ్యాహ్నం సమయానికి మరింతగా దూసుకెళ్లాయి. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణ ధోరణిని కనబర్చడంతో ఆ లాభాలన్నిటినీ కోల్పోయాయి. ఫలితంగా బిఎస్‌ఇ సెనె్సక్స్ 16 పాయింట్లు నష్టపోయి 28,507.42 పాయింట్ల వద్ద ముగియగా, జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ ఒక్క పాయింట్ లాభంతో ముగిసింది. సెనె్సక్స్‌లోని స్టాక్స్‌లో పవర్ గ్రిడ్ షేరు అత్యధికంగా 1.46 శాతం పడిపోగా, ఐటిసి 1.26 శాతం పడిపోయింది. మరో వైపు మోన్‌శాంటో ఇండియాలో 26 శాతం వాటాను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు జర్మనీకి చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ బేయర్ ప్రకటించడంతో ఆ కంపెనీ షేరు 3 శాతానికి పైగా పెరిగింది.
ప్రారంభంలో 28,554.38 పాయింట్ల వద్ద బలంగా మొదలైన సెనె్సక్స్ ఆ తర్వాత ఒక దశలో 28,689.36 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే లావాదేవీల చివర్లో అమ్మకాలు చోటు చేసుకోవడంతో ఒక దశలో 28,462.33 పాయింట్ల స్థాయికి పడిపోయినా చివరికి 15.78 పాయింట్ల నష్టంతో 28,507.42 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ మాత్రం 1.25 పాయింట్ల లాభంతో 8,777.15 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రధాన ఆసియా మార్కెట్లన్నీ లాభాలతో ముగియగా, ఐరోపా మార్కెట్లు కూడా అదే ధోరణిలో సాగాయి. సెనె్సక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 14 షేర్లు నష్టపోగా, 16 షేర్లు లాభాలతో ముగిశాయి. నష్టపోయిన వాటిలో ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్, ఒఎన్‌జిసి, సిప్లా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్‌అండ్‌టి, హీరో మోటా కార్ప, మారుతి సుజుకి, అదానీ పోర్ట్స్, లుపిన్ ఉన్నాయి. అయితే టాటా స్టీల్, హింద్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ వంటి షేర్లు లాభపడ్డాయి.