బిజినెస్

ఇంటర్ కనెక్టివిటీపై ఎడతెగని వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టెలికామ్ ఆపరేటర్లు ఇంటర్ కనెక్టివిటీ విషయంలో అనుసరిస్తున్న తీరుపై రిలయన్స్ జియో మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఈ సమస్యను పరిష్కరించుకోవడంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలు ‘నిజమైన చిత్తశుద్ధి’ని ప్రదర్శించడం లేదని, గత 15 రోజుల్లో ఈ సంస్థలు కొత్తగా కేవలం 9 మాత్రమే పిఓఐలను (ఇంటర్ కనెక్షన్ పాయింట్లను) మాత్రమే ఏర్పాటు చేశాయని రిలయన్స్ జియో విమర్శించింది. ఒక్కో ఆపరేటర్‌కు 4 వేల నుంచి 5 వేల వరకు ఇంటర్ కనెక్షన్ పాయింట్ల అవసరం ఉండగా, ఈ నెలలో ఎయిర్‌టెల్ కేవలం కొత్తగా ఒక్క పిఓఐని మాత్రమే ఏర్పాటు చేసిందని, దీంతో మొత్తం పిఓఐల సంఖ్య 651కి చేరుకుందని రిలయన్స్ జియో ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదేవిధంగా ఈ నెలలో కొత్తగా వొడాఫోన్ సంస్థ 5 పిఓఐలను, ఐడియా సంస్థ 3 పిఓఐలను ఏర్పాటు చేయడంతో వాటి పిఓఐల సంఖ్య వరుసగా 467, 523కు చేరుకున్నాయని రిలయన్స్ జియో తెలిపింది.
ట్రాయ్ చైర్మన్‌తో సునీల్ మిట్టల్ భేటీ
ఇదిలావుంటే, భారతీ ఎయిర్‌టెల్ సంస్థ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ బుధవారం టెలికామ్ నియంత్రణా సంస్థ ‘ట్రాయ్’ చైర్మన్ ఆర్‌ఎస్.శర్మతో సమావేశమయ్యారు. నెట్‌వర్క్ కనెక్టివిటీ విషయమై ప్రస్తుతం ఉన్న టెలికామ్ ఆపరేటర్లకు, కొత్తగా మార్కెట్లోకి ప్రవేశిస్తున్న రిలయన్స్ జియోకి మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు 20 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశం ముగిసిన తర్వాత సునీల్ మిట్టల్ విలేఖరులతో మాట్లాడుతూ, ఇప్పటికే 2,100 పిఓఐలను అందజేశామని, మరో 1000 పిఓఐలను ఏర్పాటు చేసేందుకు మంగళవారం డిమాండ్ నోట్ జారీ చేశామని తెలిపారు.

బిఎస్‌ఎన్‌ఎల్‌కు
రూ.1,250 కోట్లు
సబ్సిడీ చెల్లింపునకు క్యాబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్)కు దీర్ఘ కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న 1,250 కోట్ల సబ్సిడీని చెల్లించేందుకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. 2002 ఏప్రిల్ 1వ తేదీకి ముందు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ల్యాండ్ లైన్ కనెక్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఈ సబ్సిడీని అందజేయనుంది. గ్రామీణ ప్రాంతాల్లో వైర్‌లైన్ కనెక్షన్ల ఏర్పాటు వలన బిఎస్‌ఎన్‌ఎల్‌కు ఏర్పడిన లోటుకు పరిహారంగా ప్రభుత్వం ఈ సబ్సిడీని అందజేయనుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన అధికార ప్రతినిధి ఫ్రాంక్ నొరోన్హా ‘ట్విట్టర్’లో వెల్లడించారు. 2002 ఏప్రిల్ 1వ తేదీకి ముందు గ్రామీణ ప్రాంతాల్లో బిఎస్‌ఎన్‌ఎల్ ఏర్పాటు చేసిన ల్యాండ్‌లైన్ కనెక్షన్లకు సంబంధించి యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ నుంచి ప్రభుత్వం ఈ సబ్సిడీని ఇవ్వనుందని ఆయన తెలిపారు.
రూ.31,300 కోట్ల నిధుల సమీకరణకు
నాబార్డ్ తదితర సంస్థలకు అనుమతి
ఇదిలావుంటే, వౌలిక వసతుల రంగంలో వ్యయాన్ని వేగవంతం చేసేందుకు వీలుగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాండ్లను జారీ చేయడం ద్వారా ఎన్‌హెచ్‌ఎఐ, పిఎఫ్‌సి, ఆర్‌ఇసి, ఐఆర్‌ఇడిఎ, నాబార్డ్, ఇన్‌లాండ్ వాటర్ అధారిటీ 31,300 కోట్ల రూపాయల నిధులను సమీకరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది.

ప్రీపెయడ్ ఖాతాదారులకు
వొడాఫోన్ ‘ఫ్లెక్స్’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 21: మారుతున్న వినియోగదారుల అవసరాలకు తగిన పరిష్కారాలను అందించేందుకు వొడాఫోన్ బుధవారం ఇక్కడ వోడాఫోన్ ఫ్లెక్స్‌ను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా వొడాఫోన్ ఇండియా కమర్షియల్ డైరక్టెర్ సందీప్ కటారియా మాట్లాడుతూ ప్రీ పెయిడ్ కస్టమర్లకు వాయిస్, డాటా లేదా ఎస్‌ఎంఎస్ కోసం ముందుగా నిర్దేశించిన కోటాతో సంబంధం లేకుండా ఈ విధానాన్ని ఆవిష్కరించినట్లు చెప్పారు. ఒక సింగిల్ రీచార్జీతో ఈ సదుపాయాలను పొందవచ్చన్నారు. 90 శాతం కస్టమర్లు ప్రీ పెయిడ్ వినియోగించుకోవడానికి ఇష్టపడుతుంటారన్నారు. వొడాఫోన్ ఫ్లెక్స్ రూ. 96, రూ. 196, రూ. 296 డినామినేషన్లలో లభిస్తుందన్నారు.