బిజినెస్

2022 సంవత్సరం నాటికి 24 లక్షల రైతులకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: దేశంలో నిపుణులైన వ్యవసాయ కార్మికుల కొరత చాలా ఎక్కువగా ఉండటంతో 2022 సంవత్సరం నాటికి 24 లక్షల మంది రైతులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఇకార్) నిర్ణయించింది. పాలీహౌస్ నిర్మాణం, బయోగ్యాస్, వర్మీ కంపోస్టు తదితర రంగాల్లో రైతులకు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 14 కోట్ల మంది రైతులు ఉన్నారని, అయితే పాలీహౌస్‌ల నిర్మాణం, తేనెటీగల పెట్టెల తయారీ, పుట్టగొడుగుల సాగు తదితర రంగాల్లో రైతులకు తగిన తోడ్పాటు ఇవ్వగలిగే నిపుణులైన వ్యవసాయ కార్మికుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నందున 2022 నాటికి 24 లక్షల మంది రైతులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామని మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన వ్యవసాయ పెట్టుబడిదారుల సమావేశంలో ఇకార్ డిప్యుటీ డైరెక్టర్ జనరల్ (ఎక్స్‌టెన్షన్) ఎకె.సింగ్ వివరించారు.