బిజినెస్

కాల్ డ్రాప్స్.. మీ వల్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: దేశంలో అతిపెద్ద సెల్యులార్ ఆపరేటర్‌గా కొనసాగుతున్న ఎయిర్‌టెల్ టెలికామ్ మార్కెట్లోకి కొత్తగా ప్రవేశిస్తున్న రిలయన్స్ జియోపై మంగళవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. సరైన రీతిలో సన్నద్ధం కాకపోవడంతో పాటు నెట్‌వర్క్‌ను సరిగా పరీక్షించుకోకుండా మార్కెట్లో ప్రవేశించడానికి ముందే భారీ సంఖ్యలో ఖాతాదారులను చేర్చుకోవడం వల్లనే నెట్‌వర్క్ కనెక్టివిటీలో ఇబ్బందులు, కాల్ ఫెయిల్యూర్స్ (కాల్ డ్రాప్స్) సమస్యలు తలెత్తుతున్నాయని సోమవారం రిలయన్స్ జియోకి రాసిన లేఖలో ఎయిర్‌టెల్ విమర్శించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ తదితర సంస్థలు తమకు తగినంత సంఖ్యలో ఇంటర్ కనెక్టివిటీ పాయింట్లను (పిఓఐలను) ఇవ్వకపోవడం వల్లనే కాల్ ఫెయిల్యూర్స్ సమస్య తీవ్ర రూపం దాల్చిందని రిలయన్స్ జియో ఆరోపిస్తున్న విషయం విదితమే. అయితే రిలయన్స్ జియో సంస్థ వాణిజ్య పరమైన సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడానికి ముందే భారీ సంఖ్యలో ఖాతాదారులకు కనెక్షన్లు ఇవ్వడమే కాల్ ఫెయిల్యూర్స్‌కు ప్రధాన కారణమని భావిస్తున్నామని ఎయిర్‌టెల్ ఎదురుదాడికి దిగింది. మొబైల్ నెట్‌వర్క్‌లో వాస్తవ రద్దీని ఆధారంగా చేసుకునే ఇంటర్ కనెక్టివిటీ పాయింట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ విషయంలో ఇతర ఆపరేటర్లు కూడా ఇదేవిధంగా స్పందించాల్సిన అవసరం ఉందన్న వాస్తవాన్ని రిలయన్స్ జియో గుర్తించాలని ఎయిర్‌టెల్ ఆ లేఖలో స్పష్టం చేసింది.