బిజినెస్

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఐఎల్‌ఓ ఒప్పందాల ఆమోదానికి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) రూపొందించిన 138, 182వ ఒడంబడికలను ఆమోదించేందుకు భారత్ సిద్ధంగా ఉందని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ సమావేశంలో దత్తాత్రేయ ప్రసంగిస్తూ, 14 ఏళ్లలోపు బాలలను పనుల్లో చేర్చుకోకుండా భారత్ పూర్తిగా నిషేధం విధించడంతో పాటు ప్రమాదకరమైన వృత్తుల్లో 18 ఏళ్లలోపు వారిని చేర్చుకోకుండా నిషేధం విధించిందన్నారు. అంతేకాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రసూతి ప్రయోజన చట్టాన్ని సవరించి ఇంతకుముందు 12 వారాలుగా ఉన్న ప్రసూతి ప్రయోజనాన్ని (వేతనంతో కూడిన సెలవును) 26 వారాలకు పొడిగించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే రాజ్యసభ ఆమోదించిన ఈ బిల్లును వచ్చే శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. అభివృద్ధి పథకాల ప్రయోజనాలను పేద, మధ్యతరగతి ప్రజలకు అందేలాచూసి, దేశ ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో వారిని భాగస్వాములను చేసేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. ఈ సమావేశంలో కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి శంకర్ అగర్వాల్ ప్రసంగిస్తూ, రానున్న మూడు సెషన్లలో జరిగే చర్చల్లో ఉపాధి కల్పన, సామాజిక భద్రత, సమ్మిళిత అభివృద్ధి తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించడం జరుగుతుందని తెలిపారు.

సమావేశంలో అధ్యక్షోపన్యాసమిస్తున్న బండారు దత్తాత్రేయ