బిజినెస్

అదృష్టం.. అన్‌మోల్ వల్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 27: తనయుడు అన్‌మోల్ రాకతో రిలయన్స్ క్యాపిటల్ కంపెనీకి అదృష్టం వరించిందని సంస్థ చైర్మన్ అనిల్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. కంపెనీ షేర్ ధరలు 40 శాతం పెరిగాయని, ఇదంతా అన్‌మోల్ వల్లనే సాధ్యమయిందని అనిల్ అంబానీ పుత్రోత్సాహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు అన్‌మోల్ ప్రభావం ఇకపై కొనసాగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం ఇక్కడ జరిగిన రిలయన్స్ క్యాపిటల్ వాటాదారుల వార్షిక సమావేశంలో అనిల్ అంబానీ కుమారుడు అన్‌మోల్ అంబానీని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పరిచయం చేశారు. విశ్వాస ఓటు ద్వారా అన్‌మోల్ నియామకానికి ఆమోదం తెలిపినందుకు వాటాదారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మాట్లాడిన అనిల్ అంబానీ కుమారుడిపై ప్రశసంల వర్షం కురిపించారు. అన్‌మోల్ కంపెనీ డైరెక్టర్ల బోర్డులో సభ్యుడిగా చేరినప్పటినుంచి రిలయన్స్ క్యాపిటల్ షేర్లు 40 శాతం పెరిగాయని, భవిష్యత్తులో సైతం ఈ ప్రభావం కొనసాగుతుందన్న విశ్వాసం తనకు ఉందని ఆయన అన్నారు.
బ్రిటన్‌లోని వార్విక్ బిజినెస్ స్కూలులో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 24 ఏళ్ల అన్‌మోల్ రెండేళ్ల పాటు కంపెనీలో శిక్షణ పొందారు. నెల రోజుల క్రితమే ఆయన రిలయన్స్ క్యాపిటల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో అదనపు డైరెక్టర్‌గా చేరారు. నా తండ్రి, తల్లి ఆశీస్సులతో పాటుగా మీ మద్దతు, ఆశీస్సులు అన్‌మోల్‌కు లభిస్తాయని తాను ఆశిస్తున్నానని ఈ సందర్భంగా అనిల్ అంబానీ చెప్పారు.
ఇదిలా ఉండగా, 2017 ఏప్రిల్ నాటికి రిలయన్స్ క్యాపిటల్ విడిగా తన హోమ్ ఫైనాన్స్ విభాగాన్ని ప్రారంభిస్తుందని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా అనిల్ చెప్పారు. అలాగే కమర్షియల్ రుణ విభాగాన్ని, బీమా సంస్థను కూడా సరయిన సమయంలో విడిగా లిస్టింగ్ అవుతాయని ఆయన తెలిపారు. సరయిన సమయంలో జీవిత బీమా, సాధారణ బీమా, కమర్షియల్ ఫైనాన్స్ విభాగాలను విడివిడిగా లిస్టింగ్ చేయాలని కంపెనీ నావిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా, వచ్చేఏడాది మార్చి నాటికల్లా కంపెనీ కవర్ ఇనె్వస్ట్‌మెంట్ కంపెనీ హోదా కోసం దరఖాస్తు చేస్తుందని కూడా ఆయన తెలిపారు.
ఇదిలా ఉండగా తన తడ్రి ధీరూభాయి అంబానీ కన్న కలలను నిజం చేసేందుకు తన అన్న ముకేష్ అంబానీతో కలిసి పని చేస్తానని ఈ సందర్భంగా అనిల్ అంబానీ అపకటించారు. సోదరుడు ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ వర్చువల్ విలీనం వాస్తవరూపం దాల్చిందని ఆయన చెప్పారు. ఇప్పుడు అన్నదమ్ములం ఇద్దరం కలిసి తమ తండ్రి ధీరూభాయి అంబానీ కలలను నెరవేరుస్తామని ఆయన ప్రకటించారు. ధీరూభాయి అంబానీ మృతి తర్వాత ఇద్దరు అన్నదమ్ములు విభేదాల కారణంగా వ్యాపారపరంగా విడిపోయిన విషయం తెలిసిందే. తాము 4జి మొబైల్ సేవలను ప్రారంభించిన తర్వాత 90 రోజుల్లోనే పది లక్షల మంది చందాదారులు చేరారని కూడా అనిల్ అంబానీ చెప్పారు. తమ ఇద్దరి కంపెనీల మధ్య సహకారం కొనసాగుతుందని, రిలయెన్స్ జియోతో తమ కంపెనీకి 2జి, 3జి, 4జి స్పెక్ట్రమ్‌కు సంబంధించి ఒప్పందాలున్నాయని కూడా ఆయన తెలిపారు. రిలయెన్స్ కమ్యూనికేషన్‌కు చెందిన టవర్స్‌ను రిలయెన్స్ జియో ఉపయోగించుకుంటుందని కూడా ఆయన చెప్పారు.