బిజినెస్

పెరుగుతున్న ‘పోటీతత్వం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: పెరుగుతున్న వ్యాపార విలువలు, మార్కెట్ సామర్థ్యం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థలో పోటీ తత్వం శరవేగంగా పెరుగుతోంది. దీంతో ప్రపంచ పోటీతత్వ దేశాల సూచీ (గ్లోబల్ కాంపిటేటివ్‌నెస్ ఇండెక్స్)లో 16 పాయింట్లు ఎగబాకి 39వ స్థానంలో నిలిచింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యుఇఎఫ్) రూపొందించిన జాబితాలో ఈ విషయం వెల్లడయింది. ఈ సూచీలో గత ఏడాది 55వ స్థానంలో ఉండిన భారత్ ఇప్పుడు 39వ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ‘బ్రిక్స్’ దేశాల్లో చైనా తర్వాత రెండో పోటీతత్వ దేశంగా నిలిచింది. కాగా, వరసగా ఎనిమిదో సారి స్విట్జర్లాండ్ ఈ జాబితాలో ప్రథమస్థానంలో నిలిచింది. కాంపిటేటివ్‌నెస్ సూచీలో భారత్ స్కోరు 4.52గా ఉండగా స్విట్జర్లాండ్ స్కోరు 5.81గా ఉంది. కాగా, సింగపూర్, అమెరికాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత నెదర్లాండ్స్, జర్మనీ, స్వీడన్, బ్రిటన్, జపాన్, హాంకాంగ్, ఫిన్లాండ్ దేశాలు వరసగా తొలి పది స్థానాల్లో నిలిచాయి. దేశీయ స్థాయిలో సంస్థలు, వౌలిక సదుపాయాలు, స్థూల ఆర్థిక వాతావరణం, ప్రాథమిక విద్య, ఆర్థిక అభివృద్ధి, సాంకేతిక సంసిద్ధత, నూతన ఆవిష్కరణలులాంటి 12 అంశాలను పరిగణనలోకి తీసుకుని 138 దేశాల ఆర్థిక వ్యవస్థలతో ఈ జాబితాను రూపొందించారు.
సరకుల మార్కెట్ సామర్థ్యం, వ్యాపార ఆధునీకరణ, నూతన విధానాలు లాంటి రంగాల్లో భారత్ పోటీతత్వం గణనీయంగా మెరుగుపడిందని, అలాగే తగ్గిన ముడి చమురు ధరలు, మెరుగుపడిన ద్రవ్య, ఆర్థిక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను నిలకడగా ఉండేలా చేయడమే కాకుండా జి-20 దేశాల్లో శరవేగంగా ఎదుగుతున్న వ్యవస్థగా చేసిందని ఆ నివేదిక పేర్కొంది. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉందని, భారత దేశం అభివృద్ధి పథంలో భారీ సవాళ్లు ముందున్నాయని ఆ నివేదిక అంటూ, వౌలిక సదుపాయాలు అలాగే ఆరోగ్యం, విద్య లాంటి లాంటి సామాజికపరమైన కొలమానాల విషయంలో గత దశాబ్ద కాలంలో గణనీయమైన మెరుగుదల ఉన్నప్పటికీ మిగతా దేశాలకన్నా వెనుకబడిన ఉందని ఆ నివేదిక తెలిపింది.