బిజినెస్

అంతర్జాతీయ రోమింగ్‌లో అపరిమితంగా ఉచిత కాల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన సెల్యులార్ సంస్థ రిలయన్స్ జియో వాణిజ్య పరమైన సేవలను ప్రారంభించడానికి ముందే పెను సంచలనాలను సృష్టిస్తుండటంతో దేశీయ టెలికామ్ మార్కెట్లో ధరల యుద్ధానికి తెర లేచింది. దీంతో అమెరికా, కెనడా, బ్రిటన్, సింగపూర్ తదితర ప్రముఖ దేశాల్లో పర్యటిస్తున్నప్పుడు తమ ఖాతాదారులకు అంతర్జాతీయ రోమింగ్‌లో ఉచితంగా అపరిమిత కాల్స్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు అగ్రగామి సెల్యులార్ ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ ప్రకటించింది. అంతేకాకుండా కొత్తగా ప్రవేశపెట్టిన అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌లో భాగంగా భారత్‌కు ఉచితంగా టెక్స్ట్ మెసేజ్‌లను పంపుకునేందుకు వీలు కల్పించడంతో పాటు ఉచిత వినియోగ పరిమితి దాటిన తర్వాత భారత్‌కు, అలాగే ఆయా దేశాల్లో చేసుకునే కాల్స్ ధరను 3 రూపాయలకు (నిమిషానికి) తగ్గించామని ఎయిర్‌టెల్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

వాయిస్, డాటా ఆఫర్లను
ఆవిష్కరించిన ఎయిర్‌సెల్

హైదరాబాద్, సెప్టెంబర్ 28: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఎయిర్‌సెల్ 28 రోజుల చెల్లుబాటుతో పాటుగా 5జిబి, 3జి డాటాను అందిస్తున్న ఆర్‌సి 333 ప్యాకేజీని ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా 5జిబి 3జి డాటాను 28 రోజుల చెల్లుబాటుతో అందిస్తారు. అధిక డాటా వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని ఆవిష్కరించినట్లు రెండు రాష్టాల సర్కిల్ హెడ్ వెంకటేశన్ తెలిపారు. రెండు సిమ్‌లతో రెండు నంబర్ల నడుమ 12 నెలల పాటు అపరిమిత కాలింగ్ ప్రయోజనాలు ఈ పథకంలో భాగంగా ఉంటాయన్నారు. వాయిస్ కాలింగ్, డాటా ప్రయోజనాలు ఈ పథకంలో భాగంగా ఉన్నాయన్నారు.