బిజినెస్

విస్తరిస్తున్న హోటల్ పరిశ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 28: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక, పర్యాటక రంగాలు అభివృద్ధి చెందుతుండటంతో హోటల్ పరిశ్రమ భారీ స్థాయిలో విస్తరిస్తోంది. ప్రభుత్వం రోడ్లు, రవాణా, విమానయానం వంటి వౌలిక సదుపాయాల కల్పనపై శ్రద్ధ వహించడంతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ హోటళ్లు, బోట్ హౌస్‌లు, ఎంఐసిఈ (మీటింగ్, ఇన్ సెంటివ్స్, కాన్పరెనె్సస్, ఎగ్జిబిషన్స్) సెంటర్లు రిస్టార్స్, బీచ్ రిసార్ట్స్, రోడ్ సైడ్ ఎమినీటీస్ (రోడ్డు పక్కన సదుపాయాలు) సెంటర్లు నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.407 కోట్లతో ఇటువంటి 23 ప్రాజెక్టులు పూర్తి చేశారు. వాటి ద్వారా 2369 మందికి ఉద్యోగాలు లభించాయి. రూ.30కోట్లతో నిర్మించిన మరో 5 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వాటి ద్వారా మరో 160 మందికి ఉపాధి లభిస్తుంది. అవికాక ప్రస్తుతం ఇటువంటి 22 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. రూ. 1250 కోట్లతో వీటిని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలు పూర్తి అయితే ప్రత్యక్షంగా 3466 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా పది స్టార్ హోటళ్ల నిర్మాణం మొదలుపెట్టారు. వాటిలో ఐదు స్టార్ హోటళ్లు, ఒకటి 4 స్టార్ హోటల్, నాలుగు 3 స్టార్ హోటళ్లు ఉన్నాయి. ఇవి కాకుండా 30 నుంచి 72 రూముల వరకు ఉండే ఎంఐసీఈలు, బోట్ హౌస్‌లు, హోటళ్లు, రిసార్ట్స్, బీచ్ రిస్టార్స్ నిర్మాణాలు కూడా మొదలుపెట్టారు. విశాఖ, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో మాత్రమే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. 9 ప్రాజెక్టులు ఒక్క విశాఖ జిల్లాలోనే ఉన్నాయి. ఆ తరువాత ఐదు ప్రాజెక్టులు కృష్ణాజిల్లాలో, నాలుగు ప్రాజెక్టులు చిత్తూరు జిల్లాలో చేపట్టారు. గుంటూరు, చిత్తూరు జిల్లాలలో రెండేసి ప్రాజెక్టులు మొదలుపెట్టారు. కృష్ణా జిల్లాలో ఒక 5 స్టార్ హోటల్, రెండు 3 స్టార్ హోటళ్లు, గుంటూరులో ఒక 5 స్టార్ హోటల్, విశాఖలో 5 స్టార్, 4 స్టార్, 3 స్టార్ హోటళ్లు ఒక్కొక్కటి నిర్మిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో రెండు 5స్టార్ హోటళ్లు, ఒక 3 స్టార్ హోటల్ నిర్మిస్తున్నారు. వైకెఎం ఎంటర్‌టైన్‌మెన్ట్ అండ్ హోటల్ ప్రైవేట్ లిమిటెడ్, ఐటిసి, బ్లిస్ హోటల్స్ లిమిటెడ్ (గేట్ వే హోటల్), అక్కోర్ గ్రూప్ అండ్ సీ వ్యాలీ రిసార్ట్, కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, విఎస్‌ఎన్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, నైనారు మహేష్‌బాబు, కెఎస్‌ఆర్ డెవలపర్స్, సన్ రే బీచ్ రిసార్ట్స్, ఎస్టీబీఎల్ ప్రాజెక్ట్స్ వంటి సంస్థలు స్టార్ హోటళ్లు నిర్మిస్తున్నాయి. వీటిలో వైకెఎం ఎంటర్‌టైన్‌మెన్ట్ అండ్ హోటల్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రూ. 256.92 కోట్ల ఖర్చుతో చిత్తూరు జిల్లాలో నిర్మించే 5 స్టార్ హోటల్ (హాలిడే ఇన్) పెద్ద ప్రాజెక్టు, మిగిలిన ప్రాజెక్టులను అమరావతి ఎంటర్‌టైన్‌మెన్ట్, షోర్ వ్యూ హాస్పటాలిటీ, గోల్డెన్ శాండ్ బీచ్ రిసార్ట్, క్రిసెంట్ ఎడ్వెంచర్స్ అండ్ వాటర్ స్పోర్ట్స్, షెరాటన్ గ్రూప్‌కు చెందిన సన్ ఫ్రా బీచ్ క్యాపిటల్, సన్ రే బీచ్ రిసార్ట్స్, విశాఖ బోటింగ్, సుదర్శన్ ఇన్ ఫ్రా ప్రజెక్ట్స్, బీసిఎన్ రిసార్ట్స్, బాబు అండ్ బాబు మైస్ వారు నిర్మిస్తున్నారు. అనంతపురం జిల్లాలో రూ. 36 కోట్లతో నిర్మించే ఒక 3 స్టార్ హోటల్ నిర్మాణానికి అన్ని అనుమతులు మంజూరయ్యాయి. భూమి కూడా యాజమాన్యం స్వాధీనంలో ఉంది. అయితే ప్రణి ప్రాజెక్ట్స్ వారు దీని నిర్మాణం మొదలు పెట్టవలసి ఉంది. ఈ రంగానికి చెందిన 79 ప్రాజెక్టులు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. రూ. 1591 కోట్ల ఖర్చు కాగల 31 ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు మంజూరు చేసింది. వీటికి ఇతర అనుమతులు మంజూరు చేయవలసి ఉంది. రూ. 6946 కోట్ల వ్యయంతో చేపట్టే మరో 48 ప్రాజెక్టులకు ప్రభుత్వ భూమి కావాలని పారిశ్రామికవేత్తలు కోరారు. అయితే భూమిని ఇంకా కేటాయించలేదు. ఇవే కాకుండా రూ. 1508 కోట్ల వ్యయంతో ప్రారంభించే మరో 29 ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశముంది. వీటికి సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించవలసి ఉంది. ఈ స్టార్ హోటళ్లు, రిసార్ట్స్ నిర్మాణం పూర్తి అయితే దేశ విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలకు, ఉన్నతాధికారులకు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు, పర్యాటకులను సౌకర్యంగా ఉంటుంది. దాంతో పారిశ్రామిక ఉత్పత్తి రంగం, ఐటి, ఎలక్ట్రానిక్, ఫార్మశీ, విద్య, వైద్యం, పర్యాటక రంగం వంటివి అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది.