బిజినెస్

రిలయన్స్ గ్రూప్ ఉద్యోగులకు మొదలైన జియో 4జి సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 27: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోగల రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)లోని టెలికాం విభాగమైన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. ఆదివారం తమ గ్రూప్ ఉద్యోగులకు జియో బ్రాండ్ పేరిట 4జి సేవలను అందుబాటులోకి తెచ్చింది. రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపకులు, ముఖేశ్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ 83వ జన్మదినం సందర్భంగా రిలయన్స్ గ్రూప్ ఉద్యోగులకు తొలుత జియో 4జి సేవలను అందిస్తామని ఇంతకుముందే ముఖేశ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం 4జి సేవలను తొలుత ఉద్యోగులకు అందించారు. ఈ కార్యక్రమానికి రిలయన్స్ గ్రూప్ ఉన్నతోద్యోగులతోపాటు మొత్తం అంబానీ కుటుంబం హాజరైంది. ముఖేశ్, ఆయన భార్య నితా అంబానీ, కుమారులు ఆకాశ్, అనంత్, కూతురు ఇషా, తమ్ముడు అనీల్ అంబానీ, ఆయన సతీమణి టీనా, వారి పిల్లలు, తల్లి కోకిలాబెన్, చెల్లెల్లు, వారి పిల్లలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రిలయన్స్ జియో 4జి బ్రాండ్ అంబాసిడర్, బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్, సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ ఆటపాటలతో ఆహుతులను అలరించారు.