బిజినెస్

ఇక మార్కెట్‌లో ‘బీయింగ్ హ్యూమన్’ నగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు చెందిన ‘బీయింగ్ హ్యూమన్’ బ్రాండ్ జ్యుయలరీ విభాగంలోకి ప్రవేశించింది. దీంతో ఇప్పటిదాకా వస్త్ర ప్రపంచంలో కనిపించిన బీయింగ్ హ్యూమన్ బ్రాండ్ ఇకపై ఆభరణాల రంగంలోనూ అగుపించనుంది. శుక్రవారం ఇక్కడ సల్మాన్ ఖాన్ తమ నూతన వ్యాపారాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ వేడుకకు సల్మాన్ సోదరి అర్పితా ఖాన్‌తోపాటు ఆమె ముద్దుల తనయుడు అహిల్, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ‘మరింతమంది భాగస్వాములతో బీయింగ్ హ్యూమన్ బ్రాండ్‌ను మేము విస్తరిస్తున్నాం. వస్త్రాల తర్వాత ఇప్పుడు నగలనూ మా బ్రాండ్ ద్వారా మార్కెట్‌లో విక్రయిస్తాం.’ అని సల్మాన్ ఖాన్ ఈ సందర్భంగా ప్రకటించారు. కాగా, ఫ్యాషన్, అత్యుత్తమ వజ్రాభరణాలను బీయింగ్ హ్యూమన్ బ్రాండ్ పేరిట స్టైల్ కోటియెంట్ జ్యుయల్లరీ రూపొందించనుంది. అన్ని నగల దుకాణాల్లోనూ బీయింగ్ హ్యూమన్ ఆభరణాలు లభించనుండగా, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా ప్రత్యేకంగా ఆన్‌లైన్ అమ్మకాలు జరగనున్నాయి. మధ్య ప్రాచ్య, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని విదేశీ వ్యాపారాన్ని విస్తరిస్తామని స్టైల్ కోటియెంట్ జ్యుయలరీ సిఇఒ ప్రసాద్ కప్రే అన్నారు.
తమ డిజైన్లలో 80 శాతం మహిళలకు, 20 శాతం పురుషులకు సంబంధించినవి ఉన్నాయని తెలిపారు. రోజువారి వినియోగం కోసం తయారుచేసిన బీయింగ్ హ్యూమన్ నగల ధర 5,000 రూపాయల నుంచి 50,000 రూపాయల మధ్య ఉంటుందన్నారు. సహజసిద్ధమైన ఆస్ట్రేలియన్ వజ్రాలతో 18 క్యారెట్ల

చిత్రం... ‘బీయింగ్ హ్యూమన్’ జ్యుయలరీ బ్రాండ్‌ను ప్రకటిస్తున్న సల్మాన్ ఖాన్‌బంగారం జతచేసి నగలను రూపొందిస్తున్నామని చెప్పారు.

కొబ్బరి కొనే నాథుడే లేడు!

ఆయినవిల్లి, సెప్టెంబర్ 30: ‘అమ్మబోతే అడవి... కొనబోతే కొరివి’ అన్న సామెత ప్రస్తుతం కొబ్బరికి అతికినట్టు సరిపోతుంది. ఖర్చులు కూడా రాని విధంగా ధర పలుకుతుంటే, మార్కెట్లో, దేవాలయాల వద్ద రూ. 10 నుండి రూ. 15కు విక్రయిస్తున్నారు. కొబ్బరి పంటకు ప్రసిద్ధిచెందిన తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో రైతులు ప్రస్తుతం ధర లేక అతలాకుతలమవుతున్నారు. సాధారణంగా శ్రావణమాసం ప్రారంభం నుండి కొబ్బరికి డిమాండు పెరిగి, ధర ఆశాజనకంగా ఉంటుంది. అయితే దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నా ఇంతవరకు ఆశించిన ధర పలకడంలేదు. రైతులకు ప్రస్తుతం వంద కాయలకు గరిష్ఠంగా రూ. 300 వరకు మాత్రమే లభిస్తోంది. ఇందులో దింపు కార్మికులకు నూటికి రూ. 100 వంతున చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఏమాత్రం గిట్టుబాటు కావడంలేదని రైతులు వాపోతున్నారు. కొబ్బరి రైతులను ఆదుకోడానికి ప్రభుత్వం నాఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు తెరిచినా, వ్యాపారులే లాభపడుతున్నారని రైతులు పేర్కొంటున్నారు. నాఫెడ్ కేంద్రాల్లో దళారుల మాట చెల్లుబాటవుతుండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. కొబ్బరి రైతుల కోసం కోనసీమలో అయిదు మార్కెట్ యార్డుల్లో నాఫెడ్ కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించింది. వీటి ద్వారా కొబ్బరిని కొనుగోలు చేస్తున్నారు. అయినా రైతులకు లబ్ధి చేకూరడం లేదు. మరోవైపు రైతుల ఇళ్లముందు కొబ్బరి కాయల రాశులు పేరుకుపోతున్నాయి. దీంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

మార్కెట్‌లోకి మోక్ష అగరుబత్తులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 30: మోక్ష గోల్డ్, పంచ పాండవ, గోల్డ్ అంబర్ పేరిట మూడు అగరుబత్తి బ్రాండ్లను మోక్ష అగరుబత్తి సంస్థ శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. తమకు ఐఎస్‌ఒ ధృవపత్రం ఉందని సంస్థ సిఇఒ ఆనంద్ కుమార్ అక్షయ తెలిపారు. సుగంధ పరిమళాలు, ఔషధ మొక్కలు, చందనం, సహజసిద్ధమైన నూనెల మిశ్రమంతో అగరుబత్తిలను తయారు చేస్తున్నామన్నారు. 2020 నాటికి ప్రతి ఇంట్లో తమ ఉత్పత్తుల సువాసనలు వీచేలా ముందుకెళ్తున్నామని, సంస్థ టర్నోవర్ 200 కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు.

అంతంతమాత్రంగానే ఆరోగ్య బీమా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 30: దేశంలో ఆరోగ్య బీమా పాలసీలున్న వారిలో 51 శాతం మందికి తక్కువ విలువ ఉన్న బీమాలే ఉన్నాయని సర్వేలో వెల్లడైనట్లు అపోలో మ్యూనిచ్ హెల్త్‌కేర్ బీమా సంస్థ తెలిపింది. ఈ సర్వేను 82 నగరాల్లో నిర్వహించారు. చాలా మంది ప్రజలు తక్కువ విలువ ఉన్న ఆరోగ్య బీమా పాలసీని ఎన్నుకుంటున్నారని, దీనివల్ల క్లిష్ట సమయాల్లో బీమా సొమ్ము వారి వైద్యానికి సరిపోవడం లేదని, ఏటా ఆరోగ్య బీమా విలువను పెంచుకుంటూ పోవాల్సిన అవసరం ఉందని అపోలో మ్యూనిచ్ హెల్త్ బీమా సిఇఒ ఆంటోనీ జాకబ్ అన్నారు. కాగా, 45 సంవత్సరాలు దాటిన వారిలోనైతే 62 శాతం మందికి తక్కువ విలువ ఉన్న బీమాలే ఉన్నాయ. అలాగే 18 నుంచి 35 సంవత్సరాలున్న పాలసీదారుల్లో 38 శాతం మంది తక్కువ విలువ ఆరోగ్య బీమా పాలసీని కలిగి ఉన్నారు. నిజానికి 20 సంవత్సరాల వయస్సున్నవారు కనీసం రూ. 5 లక్షల ఆరోగ్య బీమాను, 30 నుంచి 40 ఏళ్ల లోపున్నవారు కనీసం రూ. 7 లక్షలు, 50 సంవత్సరాలు దాటినవారు రూ. 9 లక్షలు, 60 ఏళ్ల వారు రూ. 10 లక్షల బీమా కలిగి ఉండాలని జాకబ్ సూచించారు.

‘బ్రిక్స్’ కార్మిక సమస్యలపై
పోరాడుతాం: బిఎంఎస్

విశాఖపట్నం, సెప్టెంబర్ 30: బ్రిక్స్ దేశాల్లో కార్మిక సమస్యలపై సభ్య దేశాల కార్మిక మంత్రులతో సమీక్షించే విషయంలో భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) చొరవతీసుకుంటుందని దాని జాతీయ ప్రధాన కార్యదర్శి విర్జేష్ ఉపాధ్యాయ అన్నారు. విశాఖలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ జనాభాలో సగభాగం ఉన్న బ్రిక్స్ దేశాల్లో పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని, ఈ తరుణంలో కార్మికుల సంక్షేమం, భద్రతపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న వాదన మరింత బలపడిందన్నారు. దేశంలో కార్మిక సమస్యలపై రాజీలేకుండా పోరాడుతున్నది బిఎంఎస్ ఒక్కటేనని అసంఘటిత రంగంలో కనీస వేతనాన్ని రూ. 203 నుంచి 350కు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించామని గుర్తుచేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు, సిబ్బందికి బోనస్ చెల్లింపు, సీలింగ్ తదితర అంశాలపై బిఎంఎస్ చేసిన ఉద్యమాలతోనే మేలు చేకూరిందన్నారు. అంగన్ వాడీ, ఇతర సామాజిక కార్మికుల సమస్యల పరిష్కారం, కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత వంటి అంశాల్లో బిఎంఎస్ ఉద్యమాలు కొనసాగుతున్నాయన్నారు.

కొటక్ చేతికి బిఎస్‌ఎస్ మైక్రో ఫైనాన్స్

ముంబయి, సెప్టెంబర్ 30: బిఎస్‌ఎస్ మైక్రో ఫైనాన్స్‌ను కొటక్ మహీంద్ర బ్యాంక్ 139.2 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసింది. ఈ మేరకు బ్యాంక్ శుక్రవారం ప్రకటించింది. పూర్తి నగదు లావాదేవీగా జరిగిన ఈ డీల్‌తో బిఎస్‌ఎస్ మైక్రో ఫైనాన్స్.. కొటక్ మహీంద్ర బ్యాంక్ హస్తగతమైంది. అంతేగాక దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో నాలుగో అతిపెద్ద బ్యాంకైన కొటక్ మహీంద్ర.. ఈ డీల్‌తో అత్యంత వృద్ధిరేటును కలిగిన సూక్ష్మ రుణాల రంగంలోకి ప్రవేశించినట్లైంది. నిరుడు ఐఎన్‌జి వైశ్యా బ్యాంక్‌ను 15,000 కోట్ల రూపాయలతో కొటక్ మహీంద్ర బ్యాంక్ కొనుగోలు చేసినది తెలిసిందే.