బిజినెస్

విదేశీ పెట్టుబడిదారుల సూచనలు పరిశీలిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: దేశీయ మార్కెట్లోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు తగిన చర్యలు చేపడతామని, పన్ను వసూళ్లకు సంబంధించి విదేశీ పెట్టుబడిదారులు ప్రస్తావించిన కొన్ని సమస్యలతోపాటు వారి నుంచి వచ్చిన సూచనలను పరిశీలిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది.
న్యూఢిల్లీలో కొద్ది రోజుల క్రితం నిర్వహించిన విదేశీ పెట్టుబడిదారుల సమావేశంలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ ఈ హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం, దాని తీరుతెన్నులపై ఎవరికీ ఎటువంటి అభ్యంతరాలుగానీ, సందేహాలుగానీ లేవని, భారత మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృతమైన అవకాశాల కోసం ఎంతోమంది పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారని, మొత్తం మీద దేశంలో పెట్టుబడులకు ఎంతో సానుకూలమైన వాతావరణం ఉందని ఆయన పేర్కొన్నారు.
కాగా, విదేశీ పెట్టుబడిదారులతో దాదాపు 3 గంటల పాటు నిర్వహించిన ఈ సమావేశంలో వారి నుంచి కొన్ని ప్రత్యేక సూచనలు వచ్చాయని, వీటిని ప్రభుత్వం తప్పకుండా పరిశీలిస్తుందని తెలిపారు. ‘దేశంలో పెట్టుబడుల ప్రక్రియను సులభతరం చేయడంపై విదేశీ పెట్టుబడిదారులు ఈ సమావేశంలో కొన్ని కొత్త సూచనలు చేయడంతోపాటు పన్నులకు సంబంధించిన కొన్ని సమస్యలను ప్రస్తావించారు. రెవెన్యూ శాఖ కూడా ఈ సమావేశంలో పాల్గొంది. కనుక ఈ సమస్యలు, సూచనలను మేము తప్పకుండా పరిశీలిస్తాం’ అని శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
భారత్‌లో వ్యాపారాన్ని మరింత సులభతరం చేయడంపైనే ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించిందని, కాబట్టి ఈ సమావేశంలో విదేశీ పెట్టుబడిదారులు ప్రస్తావించిన సమస్యలు, సూచనలపై వివిధ వ్యాపార సంస్థలతో చర్చించిన తర్వాత వాటి నుంచి వచ్చే సలహాలను బట్టి ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డు (సెబీ) వంటి సంస్థలతో కలిసి మాలో మేము చర్చించుకున్న తర్వాత అవసరమైన నిర్ణయాలు తీసుకుంటాం’ అని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు.

పెరగనున్న టాటా మోటార్స్
ప్యాసింజర్ వాహన ధరలు

న్యూఢిల్లీ/న్యూయార్క్, అక్టోబర్ 2: దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్ తమ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచనుంది. ఉత్పాదక వ్యయం పెరిగిన నేపథ్యంలో ఈ పండగ సీజన్‌లోనే ధరలను పెంచడం ఉత్తమమని టాటా మోటార్స్ భావిస్తోంది. ఈ మేరకు సంస్థ ప్యాసింజర్ వాహన వ్యాపార విభాగం అధ్యక్షుడు మయంక్ పరీక్ పిటిఐకి తెలిపారు. ధరలు ఎప్పుడు పెరుగుతాయన్న ప్రశ్నకు బదులిస్తూ ఈ పండగ సీజన్‌లో పెంపు ఉండవచ్చని అన్నారు. ఇదిలావుంటే బహుళ వ్యాపార దిగ్గజమైన టాటా గ్రూప్.. కొన్ని వ్యాపారాల నుంచి వైదొలుగుతుండటంపట్ల తానేమీ బాధపడటం లేదని గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్ర్తి అన్నారు. 100కుపైగా వ్యాపార సంస్థలను కలిగి ఉన్న టాటా గ్రూప్.. గడచిన 20 ఏళ్లలో 40కిపైగా వ్యాపారాలను వదులుకుంది. ఈ క్రమంలో అన్ని పరిస్థితులను నిశితంగా గమనించే చివరగా వ్యాపార నిష్క్రమణను ఎంచుకుంటున్నామని చెప్పారు.

‘2017-18 నుంచి
ఇపిఎఫ్‌ఒ హౌసింగ్ స్కీం’
న్యూఢిల్లీ, అక్టోబర్ 2: ఎంప్లారుూస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్‌ఒ) వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) నుంచి తమ సభ్యులు (చందాదారులు) తక్కువ ధరగల ఇళ్లను కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేయనుంది. భవిష్య నిధి తాకట్టుతో సభ్యులకు సొంతింటి కలను సాకరం చేస్తుంది. బ్యాంకులు లేదా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలకు, తన సభ్యులకు మధ్య మధ్యవర్తిగా ఉంటూ ప్రావిడెంట్ ఫండ్ నుంచి అడ్వాన్స్ చెల్లిస్తుంది. తదుపరి ఇంటి రుణం నెలవారీ కిస్తులను (ఇఎంఐలు) సభ్యుడు తన పిఎఫ్ అకౌంట్ ద్వారా చెల్లించుకోవడానికి ఏర్పాట్లు చేస్తుందని ఇపిఎఫ్‌ఒ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ విపి జాయ్ ఒక వార్తా సంస్థకు చెప్పారు.